ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తామన్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది లోపు ఏ ఒక్క మావోయిస్టు ఇండియాలో ఉండరని ప్రకటించారు. ఇందు కోసం భారతీయ బలగాలు పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నాయని చెప్పారు. ఈ సందర్బగా కేంద్రం అభివృద్ది చేసిన ఎన్ఎస్జీ జాతీయ ఐఈడీ డేటా ప్లాట్ ఫారమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తదుపరి తరం రక్షణ కవచంగా అభివర్ణించారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా బాంబు సంబంధిత దాడులను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు.
ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరాలకు సంబంధించిన డేటాను క్రమపద్ధతిలో సేకరించడానికి, విశ్లేషించడానికి, పంచు కోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్ రూపొందించడం జరిగిందని చెప్పారు అమిత్ షా, వాటి డిజైన్, భాగాలు, ట్రిగ్గరింగ్ మెకానిజమ్స్ , ఉపయోగ నమూనాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవస్థ కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల మధ్య మెరుగైన సమన్వయాన్ని అనుమతిస్తుందన్నారు. నిఘా నేతృత్వంలోని కార్యకలాపాలను బలోపేతం చేస్తుందని చెప్పారు. భద్రతా దళాలు IED ముప్పులను మరింత సమర్థవంతంగా అంచనా వేయడానికి, తటస్థీకరించడంలో సహాయ పడుతుందని అన్నారు.
ఉగ్రవాదం, తిరుగుబాటు లేదా వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉన్న అన్ని రకాల బాంబు దాడులకు వ్యతిరేకంగా సమగ్ర నిరోధక చట్రాన్ని నిర్మించడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఉగ్రవాద వ్యూహాలను అభివృద్ధి చేయడంలో ముందుండడంలో సకాలంలో డేటా భాగస్వామ్యం, అధునాతన విశ్లేషణ కీలకమని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ అంతర్గత భద్రతా నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో NSG పాత్రను హోంమంత్రి నొక్కి చెప్పారు . ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలను పెంపొందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై ప్రభుత్వం దృష్టి సారించడాన్ని కొత్త వేదిక ప్రతిబింబిస్తుందని అన్నారు. కీలకమైన IED-సంబంధిత నిఘాకు రియల్-టైమ్ యాక్సెస్ ఉండేలా దేశ వ్యాప్తంగా భద్రతా సంస్థలు దశల వారీగా వ్యవస్థతో అనుసంధానించ బడతాయని భావిస్తున్నారు.
The post ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం : అమిత్ షా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం : అమిత్ షా
Categories: