hyderabadupdates.com Gallery రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా post thumbnail image

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ లోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మ‌హ‌బూబ్‌ పేట స‌ర్వే నంబ‌రు 44లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 3 వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. ఇదే స‌ర్వే నంబ‌రు 44లో ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌ని హైడ్రాకు గ‌తంలో వ‌చ్చిన ఫిర్యాదుల మేర‌కు గ‌తేడాది డిసెంబ‌రు 8వ తేదీన 5 ఎక‌రాల మేర ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. మియాపూర్ – బాచుప‌ల్లి ప్ర‌ధాన ర‌హ‌దారికి ఆనుకుని 200ల మీట‌ర్ల మేర ఉన్న‌ 18 షెట్ట‌ర్ల‌ను హైడ్రా గ‌తంలోనే తొల‌గించింది.
తాజాగా అదే స‌ర్వే నంబ‌రు 44లో 15 ఎక‌రాల‌ను స్వాధీనం చేసుకుంది. రేకులతో హ‌ద్దుల‌ను నిర్ణ‌యించి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ‌గా.. వాటిని తొల‌గించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. స‌ర్వే నంబ‌రు 44లోని ప్ర‌భుత్వ భూమిలో అక్ర‌మ రిజిస్ర్టేష‌న్ల‌తో పాటు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కు సంబంధించిన వార్తల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో హైడ్రా ప‌రిశీలించింది. ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించుకుంది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు 15 ఎక‌రాల మేర ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. 159 సర్వే నంబర్‌కు సంబంధించిన ప‌త్రాల‌తో సర్వే నంబర్ 44 లోని ఎకరన్నర వరకూ కబ్జా చేసిన‌ ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు న‌మోద‌య్యింది.
The post రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kinjarapu Atchennaidu: వైఎస్ జగన్‌ కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్Kinjarapu Atchennaidu: వైఎస్ జగన్‌ కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్

    వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఒక అబద్దాల కోరని విమర్శించారు. ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందన్నారు. గురువారం ఉమ్మడి

Minister Nara Lokesh : పిల్లలకు నైతిక విలువలు చాలా అవసరం – మంత్రి లోకేష్Minister Nara Lokesh : పిల్లలకు నైతిక విలువలు చాలా అవసరం – మంత్రి లోకేష్

Nara Lokesh : నైతిక విలువలు, సమాజంలో మార్పుకు సంబంధించి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు, విద్యా సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం,

యూనివర్సల్ హెల్త్ పాలసీ’తో నేతన్నలకు భరోసాయూనివర్సల్ హెల్త్ పాలసీ’తో నేతన్నలకు భరోసా

శ్రీ సత్యసాయి జిల్లా : నేతన్నల ఆరోగ్య రక్షణకు భరోసా ఇస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీలో వారికి ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం