hyderabadupdates.com Gallery క‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాం

క‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాం

క‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాం post thumbnail image

విజ‌య‌వాడ : క‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా విజ‌య‌వాడ వేదిక‌గా పెద్ద ఎత్తున అమ‌రావ‌తి ఆవ‌కాయ్ ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించింది. పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా మూడు రోజుల పాటు నిర్వహించిన ఈఫెస్టివ‌ల్ అంగ‌రంగ వైభ‌వంగా ముగిసింది. ఈ వేడుకలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం సంతోషంగా ఉంద‌న్నారు కందుల దుర్గేష్. ఈ సందర్భంగా అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్‌ను ఒక ప్రత్యేక బ్రాండ్‌గా తీర్చిదిద్దుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు కందుల దుర్గేష్. అందులో భాగంగా 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్‌ను మళ్లీ ఘనంగా నిర్వహిస్తామని స్ప‌ష్టం చేశారు .
కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకు రావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి, నంది అవార్డుల ప్రదానం చేస్తామ‌న్నారు. నాటకం, సినిమా, సాహిత్యం ఒకే వేదికపై మెరిసిన ఈ ఫెస్టివల్‌లో జరిగిన చర్చలు, ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు కందుల దుర్గేష్. మూడు రోజుల వేడుకల్లో భాగంగా భవానీ ఐలాండ్‌కు 15,000 మంది పున్నమి ఘాట్‌కు 30,000 మంది మొత్తంగా 45,000 మందికి పైగా సందర్శకులు పాల్గొనడం ఈ కార్యక్రమం విజయానికి నిదర్శనం అన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా, ఆవకాయను ఆంధ్రుల సాంస్కృతిక అంతర్భాగంగా నిలబెట్టే దిశగా ఈ ఫెస్టివల్ ముందడుగు వేసిందని చెప్పారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన పర్యాటక శాఖ అధికారులు, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులు, కళాకారులు, ప్రజలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు.
The post క‌ళ‌లు, సంస్కృతికి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్

    భారత్‌ పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే… వారి తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్‌ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలుDK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు

    బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విషయంపై బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు.

CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌

    కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్‌ బంధం లేకపోతే జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు