hyderabadupdates.com movies వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్ గారుకి ఆడియన్స్ సూపర్ హిట్ ముద్ర ఒక్క షోతోనే వేసేశారు. బ్లాక్ బస్టర్ దాకా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

అయిదు, ఆరు వందల రూపాయల టికెట్ రేట్లతో కూడా ఫ్యామిలీస్ థియేటర్లకు రావడం ఆశ్చర్యపరిచింది. మెగా బ్రాండ్, అనిల్ రావిపూడి మార్కెట్, హుక్ స్టెప్ సాంగ్ పెంచేసిన హైప్ ఇవన్నీ పెద్ద ప్లస్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి గుంటూరు దాకా రాత్రి సెలెబ్రేషన్లు ఓ రేంజ్ లో జరిగాయి. యుఎస్ లో 1.2 మిలియన్ డాలర్లతో చిరు పెద్ద బోణీ కొట్టేశారు.

ఇక మూవీ విషయానికి వస్తే అనిల్ రావిపూడి నుంచి ఏమేం ఆశించాలో వాటిని అందిస్తూనే తనకు మాత్రమే సాధ్యమైన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, మ్యానరిజంతో చిరంజీవి వన్ మ్యాన్ షో చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హాస్యంతో పాటు ఎమోషన్ ని బ్యాలన్స్ చేసిన తీరు ఇంటర్వెల్ కే పైసా వసూల్ అనిపించేసింది.

చిరంజీవి, నయనతార లవ్ స్టోరీని మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేసిన తీరు చాలా బాగా వచ్చింది. సెటిల్డ్ ప్లస్ ఓవర్ బోర్డు కామెడీతో రావిపూడి చేసిన మేజిక్ మాములుగా లేదు. చిరు వెంకీ కాంబో ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. భీమ్స్ ఇచ్చిన పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయిపోగా విజువల్ గా ఇంకా బాగున్నాయి.

ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లాంటి వింటేజ్ బాస్ ని బయటికి తెస్తానని చేసిన ప్రామిస్ అనిల్ రావిపూడి నిలబెట్టుకున్నాడు. ఇది తన గ్రేట్ వర్క్ అనలేం కానీ బెస్ట్ అయితే అనిపించుకుంది. ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో మన శంకరవరప్రసాద్ గారుకి వస్తున్న స్పందన అనూహ్యంగా ఉంది.

బుక్ మై షోలో సగటున గంటకు 20 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. సోమవారం వర్కింగ్ డే ఇంత అంకెలు నమోదు కావడం శుభ సూచకం. ఏది ఏమైనా భోళా శంకర్ ఫలితం, రెండేళ్ల గ్యాప్ తో ఫ్యాన్స్ ఫీలవుతున్న బాధను చిరంజీవి ఈ సినిమాతో పూర్తిగా తీర్చేశారు.

Related Post

Chiranjeevi Wishes Amitabh Bachchan on His BirthdayChiranjeevi Wishes Amitabh Bachchan on His Birthday

Megastar Chiranjeevi conveyed heartfelt birthday wishes to Bollywood legend Amitabh Bachchan. Calling him the “Legendary Icon of Indian Cinema,” Chiranjeevi praised Amitabh Bachchan’s charisma, discipline, and dedication, which continue to

ఎస్ఎస్ఎంబి 29 – రాజమౌళి మార్క్ ఆవిష్కరణఎస్ఎస్ఎంబి 29 – రాజమౌళి మార్క్ ఆవిష్కరణ

నవంబర్ నెల ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన మూవీ లవర్స్ కోరుకున్న ఘడియలు వచ్చేస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీ పదానికి కొత్త అర్థం ఇచ్చేలా రూపొందుతున్న మహేష్ బాబు – రాజమౌళి కలయికలోని సినిమాకు సంబంధించిన తొలి రివీల్ ఈ నెల 15

Location recce wrapped for Ravi Teja’s next; Foreign schedule starts todayLocation recce wrapped for Ravi Teja’s next; Foreign schedule starts today

Mass Maharaja Ravi Teja joined hands with director Kishore Tirumala for a film tentatively titled #RT76. The project, produced by Sudhakar Cherukuri under the SLV Cinemas banner, is being made