hyderabadupdates.com Gallery కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలో

కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలో

కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలో post thumbnail image

న్యూఢిల్లీ : ప్ర‌పంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఇదిలా ఉండ‌గా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ను స్పాన్స‌ర్ చేస్తోంది ప్ర‌ముఖ శీత‌ల పానియాల సంస్థ కోకో కోలా. ఇదిలా ఉండ‌గా 12 సంవ‌త్స‌రా త‌ర్వాత భార‌త దేశానికి ఫిఫా క‌ప్ ను తీసుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఇండియాలో క్రికెట్ త‌ర్వాత ఫుట్ బాల్ మేనియా కూడా కొన‌సాగుతోంది. ఇటీవ‌లే వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయ‌ర్ మెస్సీ భార‌త దేశంలో కాలు మోపాడు. త‌ను హైద‌రాబాద్ , ఢిల్లీ, ముంబై, కోల్ క‌తా న‌గ‌రాల‌లో ప‌ర్య‌టించాడు. ల‌క్ష‌లాది మంది త‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికాడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా త‌న‌కు గ్రాండ్ వెల్ క‌మ్ చెబుతార‌ని, కానీ భార‌త దేశం లో ల‌భించిన ఆద‌ర‌ణ‌, ప్రేమ తాను మ‌రిచి పోలేనంటూ పేర్కొన్నాడు మెస్సీ. దీంతో కోకో కోలా కంపెనీ త‌ను స్పాన్స‌ర్ చేస్త‌న్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని ఇండియాకు తీసుకు వ‌చ్చింది.
ఇదిలా ఉండ‌గా ఫిఫా 2026 కంటే ముందు ప్ర‌త్యేక భాగ‌స్వామిగా ఉంది. అయితే కోకా‑కోలా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడా చిహ్నాలలో ఒకదాన్ని భారతీయ అభిమానులకు దగ్గరగా తీసుకు రావడం ద్వారా ఫుట్‌బాల్‌తో తన దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ టూర్ ఫిఫా చార్ట‌ర్ ల్యాండింగ్ తో ప్రారంభ‌మైంది. ఢిల్లీలోని మాన్ సింగ్ రోడ్‌లోని తాజ్ మహల్ హోటల్‌లో అసలు ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ; మాజీ బ్రెజిలియన్ ప్రపంచ కప్ విజేత ఆటగాడు, ఫుట్ బాల్ లెజెండ్ గిల్బెర్టో డి’సిల్వా; క్రీడా చరిత్రకారుడు , రచయిత బోరియా మజుందార్, కోకా-కోలా ఇండియా , నైరుతి ఆసియా అధ్యక్షుడు సంకేత్ రే, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గ్రీష్మా సింగ్, ఆసియా ప్రజా వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ దేవయాని రాణా పాల్గొన్నారు.
The post కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Terrorists: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రవాదుల పనే!Terrorists: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రవాదుల పనే!

  దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనలో దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ సంస్థలతో పాటు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ ఇందులో భాగం అయ్యింది. ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేశారు.

Telangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతTelangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Telangana Government : స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ

KTR: కేసీఆర్‌ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా – కేటీఆర్‌ సవాల్KTR: కేసీఆర్‌ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా – కేటీఆర్‌ సవాల్

    హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్ ఎక్కడైనా సరే.. రేవంత్‌తో చర్చకు రెడీ అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి