హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన దర్శకుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. తను వరుసగా మరో హిట్ అందించాడు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ ఏడాది 2026లో సంక్రాంతి పండుగ సందర్బంగా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికే మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, నయనతార కీ రోల్ పోషించారు. ప్రమోషన్స్ కూడా అదిరాయి. పాజిటివ్ టాక్ రావడంతో సినీ పరిశ్రమలో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా గత కొంత కాలంగా మెగాస్టార్ కు ఆశించిన బిగ్ హిట్ రాలేదు.
ఈ తరుణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన మన శంకర వర ప్రసాద్ చిత్రం దుమ్ము రేపుతోంది. వసూళ్ల పరంగా దూసుకు పోతోంది. కేథరిన్ త్రెసా, వీటీవీ గణేష్ కూడా ముఖ్య పాత్రలలో జీవించారు. ఇక భీమ్స్ సిసిరిలియో అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఇక పాటలు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ట్రెండింగ్ లో ఉంది. మెగాస్టార్, వెంకీ మామ కలిసి చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. అనిల్ రావిపూడి అంటేనే మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడు కావడంతో ఫుల్ నమ్మకం పెట్టుకున్నాడు మెగాస్టార్.
The post మన శంకర వరప్రసాద్ మూవీ అదుర్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మన శంకర వరప్రసాద్ మూవీ అదుర్స్
Categories: