hyderabadupdates.com movies బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన శైలిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సినిమా తీసే దర్శకుల కోసం చూస్తుంటారు. ఆ హీరో కెరీర్లో ది బెస్ట్ అనిపించుకున్న సినిమాలను.. పెర్ఫామెన్సులను గుర్తు చేసేలా పాత్రలను క్రియేట్ చేసి.. తెరపై బాగా ప్రెజెంట్ చేస్తే ఫ్యాన్స్‌కు నోస్టాల్జిక్ ఫీల్ వస్తుంది. వారి ఆనందానికి అవధులు ఉండవు.

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక చాలా సినిమాల్లో ఆయన బలాలను సరిగా వాడుకోలేకపోయారనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. వింటేజ్ చిరును తెరపైకి తీసుకొచ్చి, అభిమానులను అమితానందానికి గురి చేసిన దర్శకుడంటే బాబీనే. ‘వాల్తేరు వీరయ్య’లో చిరు కామెడీ టైమింగ్‌ను అతను వాడుకున్న తీరు అభిమానులకు నచ్చింది. ఆ సినిమాలో అందరికీ వింటేజ్ చిరు ఛాయలు కనిపించాయి. ఐతే ‘వాల్తేరు వీరయ్య’లో బాబీ చూపించింది టీజర్ మాత్రమే. ఇప్పుడు అనిల్ ‘మన శంకర వరప్రసాద్ గారు’లో ఏకంగా ట్రైలరే వదిలాడు.

వింటేజ్ చిరును రీఎంట్రీలో అనిల్ కంటే బాగా ఇంకెవరూ వాడుకోలేదన్నది స్పష్టం. ఇకముందు కూడా చిరును ఇంత బాగా ఇంకొకరు ప్రెజెంట్ చేయగలరా అన్నది సందేహమే. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్.. ఇలా ఎన్నో చిరు బ్లాక్ బస్టర్ సినిమాల్లోంచి ఆయన కామెడీ టైమింగ్‌ను సరిగ్గా పట్టుకుని దాన్ని మళ్లీ అందంగా రీక్రియేట్ చేయడంలో అనిల్ విజయవంతం అయ్యాడు.

‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ చూసి చిరు కామెడీ వర్కవుట్ అవుతుందా.. కెరీర్లో ఈ దశలో ఆయనకు టైమింగ్ కుదురుతుందా.. ఈ తరం ప్రేక్షకులను ఆయన మెప్పించగలరా అన్న సందేహాలు కలిగాయి కానీ.. సినిమా చూశాక ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. సినిమా అంతా మంచి ఫ్లోతో వెళ్లిపోయాడు చిరు.

తనదైన కామెడీ టైమింగ్‌తో నిన్నటితరం అభిమానులనే కాక.. ఈ తరం ప్రేక్షకులనూ ఆయన ఆకట్టుకుంటున్నారు. చిరు పాత సినిమాల మీద ఎంతో రీసెర్చ్ చేసి.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచిని కూడా దృష్టిలో ఉంచుకుని అనిల్ సన్నివేశాలను డిజైన్ చేసిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులైతే అనిల్‌ను మామూలుగా పొగడట్లేదు. థాంక్యూ అనిల్ రావిపూడి అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

Related Post

తమన్ చెప్పింది రైటే… కానీ కాదుతమన్ చెప్పింది రైటే… కానీ కాదు

అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని, అంత పెద్ద సమస్య వచ్చి డిసెంబర్ నాలుగు రాత్రి రిలీజ్ కావాల్సిన సినిమాను కొన్ని గంటల ముందు నిలువరించడం సరికాదని,

Prasanth Varma Condemns One-Sided Media Reports on PrimeShow DisputePrasanth Varma Condemns One-Sided Media Reports on PrimeShow Dispute

Filmmaker Prasanth Varma has issued a strong statement condemning what he described as “motivated and irresponsible” media reports about his ongoing dispute with PrimeShow Entertainment Pvt. Ltd. The director expressed

మురారి మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలిమురారి మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి

అసలే సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు పోటీలో ఉండటం వల్ల ప్రమోషన్ల పరంగా ఎవరికి వారు నువ్వా నేనానే రీతిలో ప్లాన్ చేసుకుంటున్నారు. రాజా సాబ్ హైదరాబాద్ లో ఈవెంట్ చేస్తే మన