hyderabadupdates.com Gallery మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్

మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్

మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్ post thumbnail image

హైద‌రాబాద్ : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న‌తార , టీవీకే గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఈనెల 11న ప్రిమీయ‌ర్ షో ప్ర‌ద‌ర్శించ‌గా జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది ఈ మూవీ. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో ముందుకు వెళుతోంది. 70 ఏళ్ల వ‌య‌సులో కూడా మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు ధీటుగా న‌టించ‌డంతో సినిమా బిగ్ స‌క్సెస్ సాధించింది. అంతే కాదు తొలి రోజు ఏకంగా 84 కోట్లు వ‌సూలు చేసింది. ఇదిలా ఉండ‌గా అనిల్ రావిపూడి కామెడీని పండించాడు. వినోదం ఉండేలా చూశాడు. మ్యూజిక్ ప‌రంగా సినిమాకు బిగ్ అస్సెట్ గా మారింది. రాబోయే రోజుల‌లో ఇంకెన్ని కోట్లు వ‌సూలు చేస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేమ‌ని అంటున్నారు సినీ రంగం అనలిస్టులు.
ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం మెగాస్టార్ చిరంజీవి న‌టించిన మూవీ స‌క్సెస్ కావ‌డంతో సంతోషాన్ని త‌ట్టుకోలేక పోయింది త‌న కోడలు, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కొణిద‌ల‌. ఉపాసన కొణిదెల సోషల్ మీడియా ద్వారా తన మామకి అభినందనలు తెలిపారు. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆమె ఇలా రాశారు ఇది ఒక మెగా సంక్రాంతి అంటూ కితాబు ఇచ్చారు. కాగా సాహు గారపాటి , సుష్మిత కొణిదెల సంయుక్తంగా మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సినిమాను నిర్మించారు. ఈ సంక్రాంతికి ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్స‌ , రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఇతర పెద్ద తెలుగు చిత్రాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధం కావ‌డం విశేషం.
The post మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Red Alert: ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌Red Alert: ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఏపీలోని ప్రకాశం, వైఎస్‌ఆర్‌ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

ప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు భాగంప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు భాగం

ఢిల్లీ : ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు భాగం అని ఆ విష‌యం గుర్తించాల‌న్నారు ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్. గ్రాడ్యుయేట్లు మూడు ప్రధాన బాధ్యతలను నిలబెట్టు కోవాలని కోరారు. సత్యాన్ని అన్వేషించడంలో మేధోపరమైన నిజాయితీ, అసమానతలను తగ్గించడానికి సామాజిక సమ్మిళితం, జాతీయ