hyderabadupdates.com Gallery వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి post thumbnail image

హైద‌రాబాద్ : కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో పాటు అందాల ముద్దుగుమ్మ‌లు ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌య‌తి, సునీల్ , స‌త్య‌, వెన్నెల కిషోర్ , గెట‌ప్ శ్రీ‌ను, ముర‌ళీధ‌ర్ గౌడ్, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. కథా ప‌రంగా చూస్తే సంతోషంగా పెళ్లైన వ్యక్తి వివాహేతర సంబంధంలో చిక్కుకుని, దాని పర్యవసానాలను ఎదుర్కోవడం చుట్టూ తిరుగుతుంది. రవితేజ కొన్ని నవ్వులు పూయించడంలో, రొమాంటిక్ సన్నివేశాలలో పర్వాలేదని అనిపించాడు. పూర్తిగా వినోదాన్ని పండించాడు. ఇదిలా ఉండ‌గా ర‌వితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వంటి వరుస నిరాశలతో ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న నటుడు రవితేజకు ఈ సినిమా కొంచెం ప‌ర్వాలేద‌ని అనిపించాడు.
ఒక ర‌కంగా ఈ సినిమా ర‌వితేజ‌కు ఆక్సిజ‌న్ ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ చిత్రం ఆసక్తికరంగా ఉండ‌టంతో స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు ర‌వితేజ ఫ్యాన్స్. జోకులు, స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు కిషోర్ తిరుమల భర్త, భార్య, మరో మహిళ అనే మూస ఫార్ములాను ఎంచుకున్నా వినోదాన్ని పండించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. ఇదిలా ఉండ‌గా తన జీవితంలోని ఇద్దరు మహిళలను సమర్థించుకునే కథానాయకుడి ఆలోచన తెలుగు సినిమాలో పదే పదే చూపిస్తూ వ‌చ్చారు. జ‌నం కూడా వాటిని ఆద‌రిస్తున్నారు. దీంతో ఈ కాన్సెప్ట్ తోనే ప‌లు సినిమాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. వెండి తెర‌పై న‌వ్వులు పూయించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు.
The post వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Konda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీKonda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీ

Konda Surekha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వెళ్లారు. పీసీసీ

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు

CM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీCM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీ

Mamata Banerjee : ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జల్‌పాయీగుడీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సోమవారం పర్యవేక్షించారు.