hyderabadupdates.com movies సజ్జల కాదు.. జగన్‌నే అసలు సమస్య..?

సజ్జల కాదు.. జగన్‌నే అసలు సమస్య..?

వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి. ఆయన వ్యవహార శైలిని చాలా మంది తప్పుబట్టారు. సజ్జల కారణంగానే పార్టీ నుంచి బయటకు వచ్చామని కొందరు రెడ్డి నాయకులు కూడా చెప్పుకొచ్చారు. మరికొందరు సజ్జల‌ను తప్పించాలంటూ డిమాండ్‌లు చేశారు. అయితే ఎంత మంది ఎంత విమర్శలు చేసినా, ఎంత మంది ఆరోపణలు చేసినా సజ్జల మాత్రం కొనసాగుతూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే అసలు సమస్య సజ్జల కాదని, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని ఇప్పుడు పార్టీ నాయకులు వాపోతున్నారు. “జగన్ వ్యవహార శైలి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి, నాయకులకు ఇబ్బందులు వస్తున్నాయి” అనే మాట బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, కొన్నాళ్ల క్రితం వరకు జగన్‌ను సమర్థించిన కరడు గట్టిన నాయకులు కూడా ఇప్పుడు విభేదిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని జగన్ పట్టుకోలేకపోతున్నారని అంటున్నారు.

నిజానికి ఒకప్పుడు వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకు పదిలంగా ఉంటుందని, దానిపై కొద్దిగా పెంచుకుంటే సరిపోతుందని జగన్ భావించారు. కానీ దీనికి భిన్నంగా ప్రస్తుతం ఓటు బ్యాంకు పెరగడం కాకుండా మరింత తగ్గుముఖం పడుతోందనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఆన్‌లైన్ సర్వే సంస్థలు చేసిన కొన్ని సర్వేల్లో జిల్లాల వారీగా వైసీపీ గ్రాఫ్ దిగజారినట్లు తేలింది.

ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, విజయవాడతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి భారీ స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. గతం నుంచే ఈ జిల్లాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, 2019 ఎన్నికల్లో జగన్ పాదయాత్ర ప్రభావంతో కొంతమేర వైసీపీకి మళ్లాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాలన్నీ కలిసి వైసీపీని మరింత దిగజార్చుతున్నాయన్నది పార్టీ నాయకుల మాట. మరి దీనికి కారణం సజ్జలా అంటే కాదనే సమాధానమే వస్తోంది. జగన్ వైఖరిపై విసుగు, రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు, రప్పా రప్పా వంటి డైలాగులను సమర్థించడం, పోట్టేళ్ల రక్తంతో ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వారిని ఇంటికి పిలిచి పరామర్శించడం, వారికి కానుకలు ఇవ్వడం వంటి చర్యలే జగన్ గ్రాఫ్‌ను మరింత తగ్గించాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Related Post

New Film Starring Sangeeth Shobhan Begins with Grand Launch CeremonyNew Film Starring Sangeeth Shobhan Begins with Grand Launch Ceremony

A significant new Telugu film featuring promising actor Sangeeth Shobhan launched today with a traditional pooja ceremony. The project brings together a team known for youthful, innovative storytelling and strong