hyderabadupdates.com Gallery ఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గే

ఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గే

ఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గే post thumbnail image

హైద‌రాబాద్ : యంగ్ హీరో, హీరోయిన్లు న‌వీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. ప‌లు సినిమాలు సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, వెంక‌టేశ్, న‌య‌న‌తార క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. డార్లింగ్ ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, నిధి అగ‌ర్వాల్ , రిద్ది కుమారి క‌లిసి న‌టించిన ది రాజా సాబ్ ఆశించిన మేర ఆడ‌లేదు. మ‌రో వైపు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌య‌తి క‌లిసి న‌టించిన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి కూడా విడుద‌లైంది. అయితే ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో సాగుతోంది . ప్ర‌స్తుతానికి సినిమాల ప‌రంగా చూస్తే వ‌సూళ్ల ప‌రంగా చూస్తే మెగాస్టార్ మూవీ ఏకంగా రెండు రోజుల్లోనే రూ. 150 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.
రెండో ప్లేస్ లో అన‌గ‌న‌గా ఒక రోజు మూవీ సూప‌ర్ స‌క్సెస్ తో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే మొదటి ఇరవై నిమిషాలు రొటీన్‌గా ఉంటాయి. తర్వాత, కొన్ని పంచ్ డైలాగ్‌లు , వ్యంగ్య సన్నివేశాలు బాగా పండాయి. ‘భీమవరం బల్మాస‌ , రాజు గారి పెళ్లిరో రెండు పాటలు తెరపై బాగా వచ్చాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇప్పటి వరకు చూడటానికి మంచి సినిమా అని చెప్ప‌వ‌చ్చు.
ఇందులో గౌరవపురం జమీందార్ వారసుడు రాజు గ (నవీన్ పోలిశెట్టి) తప్పుడు ప్రతిష్టకు కట్టుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేయబడ్డాడు. నవీన్ పోలిశెట్టి విజయవంతమైన చిత్రాలను అందించడం ద్వారా చాలా స్థిరంగా ఉన్నాడు.
The post ఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్

నాగ్ పూర్ : టి20 సీరీస్ లో భాగంగా నాగ్ పూర్ లోని విద‌ర్భ స్టేడియంలో జ‌రిగిన తొలి కీల‌క మ్యాచ్ లో సూర్య భాయ్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు స‌త్తా చాటింది. వ‌చ్చే నెల‌లో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా ఐసీసీ

Bhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్కBhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర వనరులు, అవకాశాలపై ప్రచారం బాధ్యత నరెడ్కోపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అన్నివైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు.

మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఉన్నంత వ‌ర‌కు పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఒక్క‌రు ఇబ్బంది ప‌డ‌కుండా చూస్తాన‌ని అన్నారు. శ‌నివారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా