న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగల్ పండుగ సందర్బంగా దేశ ప్రజలందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పొంగల్ ప్రపంచ పండుగగా ఆవిర్భవించిందని అన్నారు. తనకు మరింత ఆనందంగా ఉందన్నారు మోదీ. ఇలాంటి పండుగలు మనుషుల మధ్య మరింత సంబంధాలు పెంపొందంచేలా చేస్తాయని అన్నారు. తమిళనాడు వాసులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది తమిళ సంప్రదాయాల గొప్పదనానికి ఒక ప్రకాశవంతమైన చిహ్నమని ఆయన అన్నారు. తమిళం, ఆంగ్లంలో లేఖ రాశారు.
ప్రియమైన పౌరులారా వణక్కం అంటూ ప్రారంభించారు. పొంగల్ పండుగ శుభ సందర్భంగా మీకు , మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మానవ శ్రమకు , ప్రకృతి లయలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని మనకు గుర్తు చేస్తుందని అన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఇదిలా ఉండగా ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలకు హాజరయ్యారు. పూజలు చేసి, అక్కడ సమావేశమైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా తమిళ సమాజం, సంస్కృతిని ఆరాధించే వారు పొంగల్‌ను గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారని అన్నారు. ఈ శుభ సందర్బంలో వారిలో నేను ఒకడిని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు.
The post పొంగల్ ప్రపంచ పండుగగా మారింది : మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
పొంగల్ ప్రపంచ పండుగగా మారింది : మోదీ
Categories: