hyderabadupdates.com Gallery ‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

‘కొత్త మ‌లుపు’ మూవీ  ఫ‌స్ట్ లుక్ లాంచ్ post thumbnail image

హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఆకాష్‌, భైర‌వి అర్ద్యా క‌లిసి న‌టించిన చిత్రం కొత్త మ‌లుపు. ఇందుకు సంబంధించి హైద‌రాబాద్ లో బుధ‌వారం మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వ‌హించారు. తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతోంది ఈ చిత్రం . అంతే కాకుండా ఈ మూవీలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్ర‌లు పోషించారు.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడారు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం అని చెప్పారు. ఆకాష్–భైరవి జోడీ చాలా చక్కగా కుదిరిందని అన్నారు. వీరు బావ–మరదలుగా నటిస్తున్నార‌ని తెలిపారు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశామ‌ని,. త్వరలోనే సినిమా విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంద‌న్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తామ‌న్నారు.
గ్రామీణ నేపథ్యంతో ప్రేమ–సస్పెన్స్–కామెడీ మేళవింపుతో రూపొందుతున్న కొత్త మలుపు ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
The post ‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?

      బిహార్‌ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి

విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాంవిద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం

హైద‌రాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ – 2026 నివేదిక బ‌క్వాస్ అంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల రెండు నెలల రేవంత్

మాదిగ‌ల‌కు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డిమాదిగ‌ల‌కు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఎంఆర్పీఎస్ జాతీయ అధ్య‌క్షుడు, ప‌ద్మ‌శ్రీ మంద‌కృష్ణ మాదిగ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేశారని ఆవేద‌న