hyderabadupdates.com movies శర్వా మూవీకి శకునాలు బాగున్నాయి

శర్వా మూవీకి శకునాలు బాగున్నాయి

పండగ చివర్లో వచ్చిన సినిమా నారి నారి నడుమ మురారి. ప్రీమియర్లు పడే దాకా అండర్ డాగ్ గా ఉంటూ వచ్చింది. మన శంకరవరప్రసాద్ బ్లాక్ బస్టర్ కావడం, రవితేజ-నవీన్ పోలిశెట్టి మూవీస్ కి పాజిటివ్ టాక్ వినిపించడంతో శర్వానంద్ కు ఎదురీత తప్పదేమో అనుకున్నారు. కానీ టాక్, రివ్యూస్ చూస్తుంటే నిర్మాత అనిల్ సుంకర నమ్మకం నిజమయ్యేలా ఉంది.

బుక్ మై షోలో అప్పుడే గంటకు 2 నుంచి 5 వేల దాకా టికెట్లు అమ్ముడుపోతూ ట్రెండింగ్ లోకి రావడం చూస్తుంటే సంక్రాంతి సెంటిమెంట్ శర్వాకు మరోసారి వర్కౌటయ్యేలా ఉంది. ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి వరసలో చేరే ఛాన్స్ కనిపిస్తోంది.

సామజవరగమనతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి క్లీన్ ఎంటర్ టైన్మెంట్ నే నమ్ముకున్నారు. రొటీన్ గా వచ్చే ఇద్దరు భార్యలు, ఒక భర్త కాన్సెప్ట్ కాకుండా డిఫరెంట్ గా రాసుకోవడం క్రమంగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతోంది.

హీరోయిన్లు గొడవలు పడటం లాంటివి లేకుండా హీరో క్యారెక్టరైజేషన్ ని ఇతర పాత్రలతో ముడిపెట్టడం ద్వారా ఫన్ జనరేట్ చేయడం మరోసారి క్లిక్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా లేట్ ఏజ్ లో పెళ్లి చేసుకున్న నరేష్ ఓ రేంజ్ లో నవ్వులు పూయించారు. కొన్ని సన్నివేశాలు ఘొల్లుమనించేలా స్క్రీన్ మీద పండాయి. పాజిటివ్ టాక్ కు దోహదం చేసినవాటిలో ఇదీ ఒకటి.

కాకపోతే విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఒక్కటే ఆశించిన స్థాయిలో లేకపోవడం మైనస్ గా నిలిచింది. శర్వా మీద ప్రేక్షకుల్లో ఉన్న సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు ఓపెనింగ్స్ తో పాటు వసూళ్లు తెచ్చేలా ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సంక్రాంతి సినిమాల్లో టికెట్ రేట్ల పెంపు అడగని సినిమా ఇదొక్కటే.

రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు పెద్ద హైక్స్ తీసుకోగా భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు తమ రేంజ్ కు తగ్గట్టు పెంపు తీసుకున్నాయి. ఇది నారి నారి నడుమ మురారికి బీసీ సెంటర్లలో చాలా ప్లస్ కానుంది. ఇప్పుడు స్క్రీన్ల విషయంలో కొంత రాజీ పడినా సోమవారం నుంచి కౌంట్ పెరగొచ్చని ట్రేడ్ టాక్.

Related Post

టాక్సిక్ వెనుక ఏం జరుగుతోందిటాక్సిక్ వెనుక ఏం జరుగుతోంది

కెజిఎఫ్ తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకుని మరీ ఓకే చేసిన యష్ టాక్సిక్ డోలాయమానంలో పడిందని బెంగళూరు వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. వచ్చే ఏడాది మార్చి 19 విడుదల కావడం లేదని ఇప్పటికే ఒక వర్గం

NAGABANDHAM’s “Om Veera Naga” Song Promises a Divine Cinematic Spectacle!NAGABANDHAM’s “Om Veera Naga” Song Promises a Divine Cinematic Spectacle!

The makers of NAGABANDHAM are bringing audiences a grand visual and emotional experience with their upcoming mythological action drama. The film, directed by Abhishek Nama, is shaping up to be