hyderabadupdates.com movies బైకర్ కోసం తలుపులు తెరుచుకున్నాయి

బైకర్ కోసం తలుపులు తెరుచుకున్నాయి

మనమే తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు నారి నారి నడుమ మురారి రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. ఇంత తీవ్రమైన పోటీ, తక్కువ థియేటర్ల లభ్యతలోనూ హిట్ కొట్టే దిశగా వసూళ్లు వస్తుండటం టీమ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. క్రమంగా వీలైనన్ని స్క్రీన్లు పెంచే పనిలో నిర్మాత బిజీగా ఉన్నారు.

పండగ చివర్లో వచ్చినా ఉనికిని చాటుకోవడం శర్వాకు కొత్త కాదు. గతంలోను ఇలాంటి పెద్ద కాంపిటీషన్ ఉన్నప్పుడే ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి గొప్ప విజయాలు సాధించాయి. ఇప్పుడు నారి నారి నడుమ మురారికి ఆ స్థాయి రెస్పాన్స్ దక్కుతుందా లేక వాటిని దాటుతుందా అనేది ఇంకొద్దిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.

ఇప్పుడీ పరిణామం శర్వా నెక్స్ట్ మూవీ బైకర్ కు కలిసి వస్తోంది. నిజానికి గత ఏడాది డిసెంబర్ 6 దీన్ని విడుదల చేద్దామని అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ గ్రాఫిక్స్ పనులతో పాటు ఇతరత్రా కారణాలు వాయిదాకు ప్రేరేపించాయి. ఆఖరి వారం ఆప్షన్ గా పెట్టుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల అదీ కుదరలేదు.

దీంతో నారి నారి నడుమ మురారికి లైన్ క్లియర్ అయ్యింది. ఫెస్టివల్ కు వచ్చి సైలెంట్ కిల్లర్ అయ్యింది. ఇప్పుడీ అడ్వాంటేజ్ బైకర్ కు ఉపయోగపడనుంది. ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో ఫిబ్రవరి రిలీజ్ గురించి నిర్మాతలు యువి క్రియేషన్స్ ఆలోచన చేస్తున్నారట. ఇంకా ఫైనల్ కాలేదు.

నారి నారి నడుమ మురారి సక్సెస్ కావడంతో బిజినెస్ పరంగా బైకర్ కు మరింత హైప్ వస్తోంది. దీని కోసం శర్వానంద్ చాలా కష్టపడ్డాడు. డైట్లు పాటించి, కసరత్తులు చేసి, బరువు బాగా తగ్గి రిస్కీ స్టంట్స్ చేశాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు . ఆయనకిది పెద్ద బ్రేక్ అవుతుందని ఇన్ సైడ్ టాక్.

యువి సంస్థ వీలైనంత త్వరగా బైకర్ ని థియేటర్లకు తీసుకురావడం అవసరం. తర్వాత విశ్వంభర పనులు ఉంటాయి కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవాలంటే ముందు బైకర్ కి మోక్షం కలిగించాలి. తెరిచిన తలుపులను వాడుకోవాలి.

Related Post

రెడ్‌బుక్‌-2.0: మ‌ళ్లీ వైసీపీలో గుబులు..!రెడ్‌బుక్‌-2.0: మ‌ళ్లీ వైసీపీలో గుబులు..!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. మంత్రి నారా లోకేష్ తాజాగా మ‌రోసారి.. రెడ్ బుక్ గురించి ప్ర‌స్తావించారు. ఎవ‌రినీ వ‌దిలేది లేద‌ని.. రెడ్ బుక్‌లో చాలా పేజీలు ఉన్నాయ‌ని.. కేవ‌లం మూడు పేజీలు మాత్ర‌మే తెరిచామ‌ని చెప్పారు. ఇంకా తెర‌వాల్సిన పేజీలను

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలుఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం ప్రియుల్లో బడాబాబులు కూడా ఎంతో మంది ఉన్నారు. మందుబాబులు తీసుకునే లిక్కర్ వందల్లో ఉంటే, బడాబాబులు తాగే మద్యం ఖరీదు

దేశంలోనే ఏపీ ఫ‌స్ట్‌.. ఏ రాష్ట్రానికీ ద‌క్క‌ని ల‌క్‌!దేశంలోనే ఏపీ ఫ‌స్ట్‌.. ఏ రాష్ట్రానికీ ద‌క్క‌ని ల‌క్‌!

దేశంలోనే ఏపీ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోని ఏ రాష్ట్రానికీ ద‌క్క‌ని ల‌క్కును చేజిక్కించుకుని.. స‌గ‌ర్వంగా నిలిచింది. ఈ రికార్డుకు కార‌ణం సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్న‌మేన‌ని తెలుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబ‌డుల వేట‌లో ఉన్న