hyderabadupdates.com movies వచ్చే సంక్రాంతికి శర్వాతో వచ్చేది…

వచ్చే సంక్రాంతికి శర్వాతో వచ్చేది…

ఒకప్పుడు వైభవం చూసిన స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల.. గత కొన్నేళ్లుగా హీరోలు, నిర్మాతలు దొరక్క ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణుతో సినిమా చేద్దామన్నా కూడా అది సెట్ కాలేదు. చివరికి గోపీచంద్‌తో కష్టపడి ‘విశ్వం’ సినిమా సెట్ చేసుకున్నాడు. దానికీ ఇబ్బందులు తప్పలేదు. మధ్యలో చేతులు మారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సౌజన్యంతో పూర్తయిన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

దీంతో మళ్లీ వైట్ల కెరీర్‌లో గ్యాప్ తప్పలేదు. కొన్ని ప్రయత్నాలు చేసి ఫెయిలైన వైట్ల.. ఎట్టకేలకు తన కొత్త చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. సంక్రాంతికి రిలీజైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో సక్సెస్ అందుకున్న శర్వానంద్.. వైట్ల కొత్త చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా శర్వానే వెల్లడించాడు.

‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ మీట్లో తన కొత్త చిత్రం వైట్లతో ఉంటుందని శర్వా అనౌన్స్ చేశాడు. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని వైట్ల.. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా చూసి శర్వా అండ్ టీంను కొనియాడుతూ పోస్టు పెట్టినపుడే.. వీళ్లిద్దరి కలయికలో సినిమా రాబోతోందా అన్న సందేహాలు కలిగాయి. ఇప్పుడు శర్వా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు.

ఇంతకుముందు వైట్లతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. వచ్చే సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు కూడా శర్వా వెల్లడించాడు. ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో సంక్రాంతి హ్యాట్రిక్ హీరోగా నిలిచిన శర్వా.. తనకు బాగా కలిసొచ్చిన అదే సీజన్లో తర్వాతి సినిమాను తీసుకురాబోతున్నాడు. ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వైట్ల.. శర్వాతో తన మార్కు సినిమా తీసి మళ్లీ ప్రేక్షకుల మెప్పు పొందుతాడేమో చూడాలి మరి.

Related Post

మెరుపు దాడుల మాస్టర్ మైండ్.. హిడ్మా!మెరుపు దాడుల మాస్టర్ మైండ్.. హిడ్మా!

ఏపీలోని మారేడుమిల్లిలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి చెందారు. మెరుపు దాడుల మాస్టర్ మైండ్ హిడ్మా మృతి చెందడం సంచలనం రేకెత్తించింది. ఆయనది ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని పునర్తి

ఆత్మ విమ‌ర్శ లేదా జ‌గ‌న్ స‌ర్‌!ఆత్మ విమ‌ర్శ లేదా జ‌గ‌న్ స‌ర్‌!

ఎదుటి వారిపై ఒక వేలు చూపించేముందు నాలుగు వేళ్లు మ‌న‌వైపు చూపిస్తున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించాలి. అది వ్య‌క్తిగ‌త‌మైనా.. రాజ‌కీయాలైనా అంతే!. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. ఏపీలో వెలుగు చూసిన న‌కిలీ మ‌ద్యంపై వైసీపీ నాయ‌కులు, ముఖ్యంగా ఆ