hyderabadupdates.com Gallery ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ స్వంతం

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ స్వంతం

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ స్వంతం post thumbnail image

హైద‌రాబాద్ : ద‌మ్మున్న డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఉస్తాద్ భ‌గత్ సింగ్. ఇప్ప‌టికే 70 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అయితే ఈ మూవీ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల‌లో భాగంగా ఉండ‌డం వ‌ల్ల ద‌ర్శ‌కుడికి ఎక్కువ స‌మ‌యం కేటాయించ లేక పోయాడు. దీంతో ఈ సినిమా వ‌స్తుందా రాదా అన్న అనుమానం కూడా వ్య‌క్తం అయ్యింది ఒకానొక స‌మ‌యంలో. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, వీడియోలు, మీమ్స్, పోస్ట‌ర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. తాజాగా దేఖ్ లేంగే సాలా అన్న సాంగ్ సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.
ఇదిలా ఉండ‌గా ఈ పాట‌ను దేవిశ్రీ త‌న తండ్రి, దివంగ‌త స‌త్యానంద్ కు అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవ్ మెంట్స్ కు అనుగుణంగా పాట‌ను చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశాడు హ‌రీశ్ శంక‌ర్. త‌ను గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. అదే గ‌బ్బ‌ర్ సింగ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లేలా చేసింది. ఇదిలా ఉండ‌గా తాజాగా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కు సంబంధించి కీల‌క‌మైన అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను కైవ‌సం చేసుకునేందుకు ఓటీటీ సంస్థ‌లు పెద్ద ఎత్తున పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు అమెరికాకు చెందిన నెట్ ఫ్లిక్స్ భారీ ధ‌ర‌కు టేకోవ‌ర్ చేసుకున్న‌ట్లు టాక్.
The post ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ స్వంతం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌వితబీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌విత

విజయవాడ : ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు

Supreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తిSupreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

Supreme Court : దిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme Court) ఏప్రిల్‌ 3న తీర్పునిచ్చింది. ఈ విషయంపై పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి కోసం

రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రారూ. 3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ లోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మ‌హ‌బూబ్‌ పేట స‌ర్వే నంబ‌రు 44లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని