hyderabadupdates.com Gallery బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ post thumbnail image

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై సీరియ‌స్ అయ్యారు. మ‌రోసారి చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఈ దేశంలో గ‌త కొన్నేళ్ల నుంచి య‌ధేశ్చ‌గా ఓట్ చోరీ కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ప్పెట్ లాగా మారింద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంపై పూర్తిగా న‌మ్మకం కోల్పోయేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. మహారాష్ట్ర పౌర ఎన్నికలలో మార్కర్ పెన్నుల్లో ఉపయోగించిన చెరగని సిరాకు సంబంధించి వివాదం చోటు చేసుకుంది.
ఓటు చోరీ అనేది దేశ వ్య‌తిరేక చ‌ర్య అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పౌరులను గ్యాస్‌లైట్ చేస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా పెద్ద ఎత్తున ప్ర‌తిపక్షాలు ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఎట్ట‌కేల‌కు మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దిగివ‌చ్చింది. ఈ మేర‌కు విచార‌ణ చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించింది. సిరా నాణ్య‌త‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌డ‌తామంటూ ప్ర‌క‌టించింది. ప్రతిపక్ష నాయకులు ఓటరు వేలుపై ఉన్న గుర్తును సులభంగా తొలగించ వచ్చని, నకిలీ ఓటింగ్‌కు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా వాస్త‌వంగా ఎలా తొల‌గించ వచ్చో కూడా లైవ్ లో చేసి చూపించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు రాహుల్ గాంధీ. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి ప్ర‌స్తుతం.
The post బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం : మేడసాని మోహన్

తిరుపతి : ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్ అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి

దేవుడి పేరుతో కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయందేవుడి పేరుతో కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయం

తాడేపల్లి గూడెం : మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత మా ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించు కునేందుకు, ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని ధ్వజమెత్తారు. తిరుమల

విద్యుత్ సంక్షోభం నుంచి నేత‌న్న‌ల‌ను కాపాడాలివిద్యుత్ సంక్షోభం నుంచి నేత‌న్న‌ల‌ను కాపాడాలి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్వీ ర‌మ‌ణతో క‌లిసి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను అసెంబ్లీలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో నేత‌న్న‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏక‌రువు