hyderabadupdates.com Gallery చంద్ర‌గిరి మండ‌లాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తాం

చంద్ర‌గిరి మండ‌లాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తాం

చంద్ర‌గిరి మండ‌లాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తాం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా త‌న స్వంత ఊరు నారా వారి ప‌ల్లెలో సేద దీరారు. కుటుంబంతో క‌లిసి పండుగ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అంతే కాకుండా జ‌గ్గ‌న్న‌తోట ప్ర‌భ‌ల‌తీర్థం పండుగ సంద‌ర్బంగా ప్ర‌జ‌లంద‌రూ సుఖ సంతోషంగా ఉండాల‌ని కాంక్షించారు. ఇదే స‌మ‌యంలో తిరుప‌తి జిల్లాపై స‌మీక్ష చేప‌ట్టారు. స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు.
కందులవారిపల్లి, చిన్న రామాపురం, ఎ రంగంపేట గ్రామాలను కలిపి స్వర్ణ నారావారిపల్లికి కార్యక్రమానికి ఎంపిక చేశామ‌న్నారు. ఈ ప్రత్యేక ప్రాజెక్టు అమలు ద్వారా ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. అన్ని ఇళ్లకూ వంద శాతం సౌర ప్యానెళ్లను అమర్చడం, శాస్త్రీయ పద్ధతుల్లో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, ప్రకృతి సేద్యం విస్తరణ తదితర ప్రణాళికల ద్వారా స్థానికుల తలసరి ఆదాయం 20 శాతం మేర పెరిగిందని తెలిపారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో చంద్రగిరి మండలం అంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలని స్ప‌ష్టం చేశారు. నిర్థేసించుకున్న ఫలితాలను ఏడాదిలోపు సాధించాలని అధికారులకు సూచించారు. స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు అమలుతో ఏడాదిలో ఈ మండలంలోని ఆయా గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడే పరిస్థితిని తీసుకు వస్తాం అన్నారు.
The post చంద్ర‌గిరి మండ‌లాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

దాడుల‌ను స‌హించం తిప్పి కొట్ట‌డం ఖాయందాడుల‌ను స‌హించం తిప్పి కొట్ట‌డం ఖాయం

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్యక‌ర్త‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై దాడులు చేసినా, ఎవ‌రు పాల్ప‌డినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జనగామ పట్టణంలో త‌మ పార్టీ ఎమ్మెల్యే

Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బొంతుBonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బొంతు

Bonthu Rammohan : జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎంపికపై బీజేపీలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మాజీ మేయర్‌ కాంగ్రెస్‌ ఉపాధ‍్యక్షుడు బొంతు రామ్మోహన్‌ (Bonthu Rammohan) పేరును ఎంపీ అర్వింద్‌ ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ ను పార్టీలోకి

Rajnath Singh: సింధ్‌ మళ్లీ భారత్‌లో కలవొచ్చు – రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌Rajnath Singh: సింధ్‌ మళ్లీ భారత్‌లో కలవొచ్చు – రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌

  పాకిస్థాన్‌లోని ‘సింధ్‌’ప్రాంతం విషయంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం నేడు భారత్‌లో భాగం కాకపోయినా.. ఇక్కడి నాగరిక వారసత్వంతో ఇప్పటికీ ముడిపడి ఉందన్నారు. సరిహద్దులు మారొచ్చని, 1947లో దేశ విభజన అనంతరం పాక్‌లో