hyderabadupdates.com Gallery జ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులు

జ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులు

జ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులు post thumbnail image

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను న‌టించిన తాజా చిత్రం జ‌న నాయ‌గ‌న్. జ‌న‌వ‌రి 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అడ్డుపుల్ల వేసింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే భారీ బ‌డ్జెట్ తో తీసిన ఈ మూవీకి అడుగడుగునా అడ్డుంకులు ఏర్ప‌డ‌డంతో నిర్మాత‌లు భారీ న‌ష్టం వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈమేర‌కు జ‌న నాయ‌గ‌న్ రిలీజ్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని, మ‌ద్రాస్ హైకోర్టును ఆదేశించాల‌ని కోరుతూ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు దాఖ‌లైన పిల్ పై విచార‌ణ చేప‌ట్టేందుకు నిరాక‌రించింది ధ‌ర్మాస‌నం. ఇదే స‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ ప‌రిధిలో లేదంటూ పేర్కొంది.
అయితే జ‌న నాయ‌గ‌న్ మూవీ విడుద‌ల‌పై ఏదో ఒక నిర్ణ‌యం ఈనెల 20వ తేదీ లోపు తీసుకోవాల‌ని ఆదేశించింది మ‌ద్రాస్ హైకోర్టును. దీంతో ఆరోజు వ‌ర‌కు విజ‌య్ వేచి చూడాల్సిందే. మ‌రో వైపు జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న కూడా చేశారు మూవీ మేక‌ర్స్. సింగ‌పూర్ లో అట్ట‌హాసంగా ఆడియో లాంచ్ కూడా చేశారు. ఇప్ప‌టికే జ‌న నాయ‌గ‌న్ ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. కోట్లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్నారు విజ‌య్. ఇదే క్ర‌మంలో త‌న‌ను రాజ‌కీయంగా ఎద‌గ‌కుండా చేసేందుకు కొన్ని శ‌క్తులు కావాల‌ని త‌న‌ను ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నాయంటూ ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు. త‌ను టీవీకే పార్టీని ఏర్పాటు చేశాడు.
The post జ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాంలో చంద్ర‌బాబుకు క్లీన్ చిట్స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాంలో చంద్ర‌బాబుకు క్లీన్ చిట్

విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు భారీ ఊర‌ట ల‌భించింది. గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ హ‌యాంలో ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ లో భారీ స్కాం జ‌రిగింద‌ని సిట్ కేసు టేకోవ‌ర్ చేసింది. ఈమేర‌కు చంద్ర‌బాబు నాయుడును

ప్రకృతి వైపరీత్యాల్లో అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉంటాంప్రకృతి వైపరీత్యాల్లో అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉంటాం

అమ‌రావ‌తి : ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు.