hyderabadupdates.com movies ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారు

ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారు

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సింగిల్ స్క్రీన్ల మనుగడే ప్రమాదంలో పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరున్న ఒక్కో సింగిల్ స్క్రీన్ మూత పడుతోంది. అదే సమయంలో కొత్త మల్టీప్లెక్సుల నిర్మాణం మాత్రం ఆగట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏటా కొత్త మల్టీప్లెక్సులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.

నగరంలో అరడజనుకు పైగా మల్టీప్లెక్సులు నిర్మాణంలో ఉండడం విశేషం. అందులో మూడింటిని ఈ సంక్రాంతికి ఆరంభిస్తారని ప్రచారం జరిగింది. పండక్కి కొత్త మల్టీప్లెక్సుల్లో సినిమాలు ఆయా ఏరియాల ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశారు. కానీ ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించాయి వాటి యాజమాన్యాలు.

కోకాపేటలో అల్లు కుటుంబానికి చెందిన ‘అల్లు సినిమాస్’ గురించి కొన్ని రోజుల ముందు పెద్ద డిస్కషనే నడిచింది. అల్లు అర్జున్ కూడా హాజరై ఆ మల్టీప్లెక్స్ సాఫ్ట్ లాంచ్ కూడా పూర్తి చేశారు. ఇక పూర్తి స్థాయిలో ఈ మల్లీప్లెక్స్ అందుబాటులోకి రావడమే తరువాయి అనుకున్నారు. సంక్రాంతి సినిమాలతోనే ఇది ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.

75 అడుగులతో ఆసియాలోనే అతి పెద్ద దాల్బీ స్క్రీన్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో అందులో సంక్రాంతి సినిమాలు చూడాలని ఆడియన్స్ ఎంతో ఉత్సాహం చూపించారు. కానీ ఈ మల్టీప్లెక్స్ సంక్రాంతికి అందుబాటులోకి రాకపోవడంతో నిరాశ తప్పలేదు.

మరోవైపు హైదరాబాదీల ఫేవరెట్ సినిమా డెస్టినేషన్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రెండు మల్టీప్లెక్సులు నిర్మాణంలో ఉన్నాయి. గతంలో సుదర్శన్ 70 ఎంఎం ఉన్న చోట ఏఎంబీ సినిమాస్‌ను నిర్మిస్తున్నారు. దానికి ఎదురుగా ఒడియన్ థియేటర్లు ఉన్న చోట పీవీఆర్ వాళ్ల మల్టీప్లెక్స్ కడుస్తున్నారు.

ఇవి రెండూ సంక్రాంతికే అందుబాటులోకి వస్తాయని వార్తలు వచ్చాయి. చివరికి చూస్తే అవి కూడా సమయానికి పూర్తి కాలేదు. సంక్రాంతికి ఐదు కొత్త సినిమాలు రిలీజైన నేపథ్యంలో ఈ కొత్త మల్టీప్లెక్సులు రెడీ అయి ఉంటే సందడే వేరుగా ఉండేది. మళ్లీ వేసవి ఆరంభంలో కానీ బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి హంగామా ఉండదు. ఈలోపు వీటిని ఆరంభిస్తే సంక్రాంతి టైంలో ఉండే సందడిని చూడలేం.

Related Post

మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ షాక్మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ షాక్

భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి ఇది ఒక అతిపెద్ద ఎదురుదెబ్బ. సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత అయిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, మంగళవారం (అక్టోబర్ 14) మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 60 మంది కేడర్‌తో సహా పోలీసుల ఎదుట

Dhandoraa director urges audiences to ignore controversy and judge the film on meritDhandoraa director urges audiences to ignore controversy and judge the film on merit

Director Muralikanth Devasoth has urged audiences not to judge Dhandoraa based on the controversy surrounding actor Sivaji, and instead watch the film for its content and message. Speaking about the