రామ్ చరణ్ తాజా జిమ్ లుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పూర్తిగా వర్కౌట్ మీద ఫోకస్ చేసిన స్టిల్ లో చరణ్ కనిపిస్తున్న తీరు అభిమానులను పిచ్చెక్కిస్తోంది. షర్ట్ లేకుండా, చెమటతో తడిచిన శరీరం, టై చేసుకున్న జుట్టు… ఈ లుక్ లో ఆయన డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ జిమ్ ఫోటోలతో పాటు చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది గురించి కూడా పాజిటివ్ అప్ డేట్ వచ్చింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన తొలి పాట చికిరి చికిరి అన్ని భాషల్లో భారీ స్పందన తెచ్చుకుంది. ప్రమోషన్స్ ఇంకా పూర్తిగా మొదలు కాకముందే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం సినిమాపై ఉన్న అంచనాలను చూపిస్తోంది.
ఇటీవల పెద్ది సినిమా ఆలస్యం అవుతుందనే ప్రచారం నడిచినా, రామ్ చరణ్ స్వయంగా వాటికి చెక్ పెట్టాడు. సినిమా మార్చి 27 2026 న అనుకున్నట్టుగానే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ అప్ డేట్ తో అభిమానుల్లో మరింత నమ్మకం పెరిగింది.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్ది పై క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. జిమ్ లుక్ నుంచి పాటల వరకూ ప్రతి అప్ డేట్ సినిమాపై హైప్ ను పెంచుతోంది. మరోసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.