hyderabadupdates.com movies నీటిలోనే టెకీ ఆఖరి ఫోన్ కాల్

నీటిలోనే టెకీ ఆఖరి ఫోన్ కాల్

నోయిడాలో దట్టమైన మంచు కురుస్తున్న వేళ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయిన తీరు అందరినీ కలిచివేస్తోంది. గుర్గావ్‌లో టెక్కీగా పనిచేస్తున్న 27 ఏళ్ల యువరాజ్ మెహతా, శుక్రవారం అర్ధరాత్రి తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన మంచు వల్ల రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం, అక్కడ కనీసం రిఫ్లెక్టర్లు కూడా లేకపోవడంతో అతని కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న ఒక భవనం తాలూకు 70 అడుగుల లోతైన నీటి గుంతలోకి దూసుకెళ్లింది.

కారు నీటిలో మునిగిపోతున్న సమయంలో యువరాజ్ తన తండ్రికి ఫోన్ చేసి చేసిన ఆఖరి సంభాషణ గుండెలను పిండేస్తోంది. “నాన్నా.. నేను లోతైన నీటి గుంతలో పడిపోయాను, మునిగిపోతున్నాను.. ప్లీజ్ నన్ను కాపాడండి, నాకు చావాలని లేదు” అంటూ తండ్రిని వేడుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ సైలెంట్ అయిపోయింది. అటుగా వెళ్తున్న వారు అతని అరుపులు విని కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

ప్రమాదం జరిగిన గంటన్నర వరకు యువరాజ్ ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే రెస్క్యూ టీమ్స్ ఆలస్యంగా స్పందించాయని బాధితుడి స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి కారును, యువరాజ్ మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే కొడుకు శవమై బయటకు రావడంతో ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణం పోయిందని, డ్రైనేజీలపై మూతలు లేకపోవడం, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి, ఆ లోతైన గుంతను చెత్త వ్యర్థాలతో నింపేసి చేతులు దులుపుకోవడం గమనార్హం.

బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు బిల్డర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కన్స్ట్రక్షన్ కంపెనీలపై అజాగ్రత్త వల్ల మరణానికి కారణమైనందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇంత లోతైన గుంతను వదిలేసినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.

Related Post

శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్శిరీష్ పెళ్లి వెనుక వరుణ్, నితిన్

టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ పిల్లల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్.. ఇటీవలే తనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్