hyderabadupdates.com Gallery రాధాకృష్ణా నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ను

రాధాకృష్ణా నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ను

రాధాకృష్ణా నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ను post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క నిప్పులు చెరిగారు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మ‌ధ్య‌న మీడియా త‌న స్థాయిని దాటి వ్య‌క్తిగ‌త హ‌న‌నం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. ఆదివారం భ‌ట్టి విక్ర‌మార్క మీడియాతో మాట్లాడారు. కొత్త ప‌లుకు పేరుతో త‌న గురించి ప్ర‌త్యేకంగా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎవ‌రి ప్రయోజ‌నాల‌నో కాపాడేందు కోసం త‌మ‌ను ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ఆంధ్రజ్యోతి క‌థ‌నంలో త‌న పేరును ప్ర‌త్యేకంగా ప్రస్తావించార‌ని అందుకే తాను మీ ముందుకు వ‌చ్చాన‌ని అన్నారు. తాను రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ప్ర‌ధాన అనుచ‌రుడిన‌ని, ఆయ‌న‌పై ఉన్న కోపంతో త‌న‌ను కూడా ఇరికించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు భ‌ట్టి విక్ర‌మార్క‌.
సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తి అని, బొగ్గు గ‌నులు అనేవి ఈ ప్రాంతం ఆత్మ అని పేర్కొన్నారు. ఉప ముఖ్య‌మంత్రిగా తాను ఈ రాష్ట్రానికి చెందిన ఆస్తుల‌ను కాపాడ‌ట‌మే త‌న ప‌ని అని స్ప‌ష్టం చేశారు. ఆస్తులను సంపాదించడం కోసం, పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌. నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం అని అన్నారు. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి తాను పోరాడుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ అని తాను కాద‌ని, ఆ విష‌యం తెలుసుకోకుండా రాధాకృష్ణ క‌థ‌నం రాయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.
The post రాధాకృష్ణా నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ను appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

J.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డాJ.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డా

J.P Nadda : బిహార్‌ ఎన్నికలు ఎన్డీయే వికాసానికి, ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరుగుతున్న పోరని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (J.P Nadda) అన్నారు. భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నజీవి పార్టీ అంటూ కాంగ్రెస్‌

‘రౌడీ’ నుంచి ఆహ్వానం అంద‌లేదు : త‌రుణ్ భాస్క‌ర్‘రౌడీ’ నుంచి ఆహ్వానం అంద‌లేదు : త‌రుణ్ భాస్క‌ర్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్ భాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖ న‌టుడు, విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి గురించి స్పందించాడు. సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈనెల‌లోనే ప్ర‌ముఖ న‌టి, నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మికా మంద‌న్నా తో

Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్

    మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందనే అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చర్చకు రావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర