hyderabadupdates.com Gallery రాధాకృష్ణ ‘రాత‌ల‌’పై విచార‌ణ జ‌రిపించే ద‌మ్ముందా ..?

రాధాకృష్ణ ‘రాత‌ల‌’పై విచార‌ణ జ‌రిపించే ద‌మ్ముందా ..?

రాధాకృష్ణ ‘రాత‌ల‌’పై విచార‌ణ జ‌రిపించే ద‌మ్ముందా ..? post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌సార‌మైన ప్ర‌త్యేక క‌థ‌నం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఎన్టీవీలో వ‌చ్చిన క‌థ‌నం ఆధారంగా సిట్ వేశార‌ని, ఆ త‌ర్వాత అన్యాయంగా యూట్యూట్, ఛాన‌ల్ జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్ట్ చేశార‌ని , అకార‌ణంగా వేధింపుల‌కు గురి చేశార‌ని ఆరోపించారు. మ‌రి ఇప్పుడు సాక్షాత్తు మీ మంత్రివ‌ర్గంలో కీల‌కంగా ఉన్న , ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క రాధాకృష్ణ రాత‌ల‌పై బ‌హిరంగంగానే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశార‌ని అన్నారు. మ‌రి ఈ మొత్తం వ్య‌వ‌హారంపై, ఆంధ్రజ్యోతి కథనాలపై ‘సిట్’ విచారణ జరిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్ర‌శ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎన్టీవీలో ప్రసారమైన కథనాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఎలా అయితే నియమించారో అదే విధంగా ఈరోజు వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలపై కూడా తక్షణమే సిట్ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వేమూరి రాధాకృష్ణతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందేన‌ని అన్నారు. ఆయన పుట్టినరోజున స్వయంగా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపే ముఖ్యమంత్రి.. వార్త రాసే ముందు తనను వివరణ అడగాలి అని మెత్తటి మాటలతో సరిపుచ్చడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు దేశిప‌తి శ్రీ‌నివాస్ . ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా, వెంటనే సిట్ ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను నిగ్గు తేల్చాలని అన్నారు. చట్టప్రకారం దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
The post రాధాకృష్ణ ‘రాత‌ల‌’పై విచార‌ణ జ‌రిపించే ద‌మ్ముందా ..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టుDigital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం

రాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌రామ న‌వమి శోభా యాత్రరాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌రామ న‌వమి శోభా యాత్ర

హైద‌రాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో శ్రీరామ నవమి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా శుక్ర‌వారం శోభాయాత్ర ధూల్‌పేటలో ఘ‌నంగా ప్రారంభం అయ్యింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి, శివారు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు ఈ యాత్రలో పాల్గొనడానికి ధూల్‌పేటకు

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

కేర‌ళ : యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో పాటు సంజు శాంస‌న్ పాల్గొన్నాడు.