హైదరాబాద్ : లోకం ఉన్నంత దాకా ఎన్టీఆర్ బతికే ఉంటారని అన్నారు ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరం అన్నారు. అవి ఎన్టీఆర్‌లో ఉండేవని చెప్పారు. సూర్యచంద్రులు ఉన్నన్నాళ్లూ ఆయన బతికే ఉంటారని చెప్పారు. సినిమాల్లో ఎవరూ చేయని పాత్రలు ఎన్టీఆర్ చేశారని గుర్తు చేశారు.
ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశంతో నటనలో ఎన్నో ప్రయోగాలు చేశారని కొనియాడారు. తెదేపాను స్థాపించి సంచలనం సృష్టించారని, ఇది ఆయనకు మాత్రమే చెల్లిందన్నారు బాలకృష్ణ. కొంతమందికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరికీ చేర్చారని అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు చేయూత అందించారని తెలిపారు. నేను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వించేలా చేశారని చెప్పారు . పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు ఆయన. అప్పట్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని, ఇది తన తండ్రికి దక్కుతుందన్నారు. ప్రజల వద్దకు పాలనను చేరువ చేశారని చెప్పారు. తెలుగు గంగ, గాలేరు నగరిలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారని అన్నారు. ఆయన స్ఫూర్తిని టీడీపీ కొనసాగిస్తోందని బాలకృష్ణ అన్నారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి గుండెచప్పుడు, కళామతల్లి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని కొనియాడారు.
The post సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్ బతికే ఉంటారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్ బతికే ఉంటారు
Categories: