hyderabadupdates.com Gallery పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కు కేటీఆర్ వార్నింగ్

పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కు కేటీఆర్ వార్నింగ్

పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కు కేటీఆర్ వార్నింగ్ post thumbnail image

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌నర్ వీసీ స‌జ్జ‌నార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. మంగ‌ళ‌వార ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎమర్జెన్సీ పాలన ఉంటే మీరు బయట ఉండేవాళ్లా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిప‌డ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చ‌రించారు. రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడి మధ్యలో మీరు బలికావద్దని హిత‌వు ప‌లికారు. రెండేళ్లలో తప్పకుండా అధికారంలోకి వస్తామ‌న్నారు. తప్పుడు కేసులు పెడుతూ, రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడే అధికారులను వదిలి పెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక మీడియా సంస్థలో వచ్చిన కథనంపై సిట్ విచార‌ణ చేశార‌న్నారు. మరి ఇంకో మీడియా సంస్థ అంతకంటే దారుణంగా కథనాలు ప్రచురించిందని, మ‌రి ఆ సంస్థ‌పై ఎందుకు సిట్ వేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు కేటీఆర్.
కేవలం తెలంగాణ జర్నలిస్టుల మీదనే ప్రతాపం చూపిస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీష్ రావు ఈరోజు హాజరయ్యారని. అన్నారు. రేవంత్ రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉన్నదని అన్నారు. అదే విధంగా అందరికీ అది అంటించాలని చూస్తున్నాడని ఆరోపించారు. అడ్డగోలు సిట్ విచారణల పేరుతోనే ఎన్ని రకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యం, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటాం అని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. అధికారం అందలం ఎక్కించినా.. రేవంత్ బుద్ధి మాత్రం బురదలోనే ఉన్నదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్‌గ్రెస్.. ఒక మంత్రి 20 శాతం, ఇంకో మంత్రి బ్యాగ్‌మాన్.. రేవంత్ రెడ్డి డబ్బుల సంచి పంపించినట్లు ఉన్నారు అందుకే భట్టి మౌనంగా ఉన్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.
The post పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కు కేటీఆర్ వార్నింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదుసినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సమస్యపై ఎలాంటి సమాచారం లేదన్నారు. పుష్ప-2 సినిమా తర్వాత బెనిఫిట్

వ్య‌వ‌సాయ రంగంలో ఏఐ అమ‌లు భేష్వ్య‌వ‌సాయ రంగంలో ఏఐ అమ‌లు భేష్

అమ‌రావ‌తి : బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మ‌న్ బిల్ గేట్స్ సోమ‌వారం ఏపీ రాష్ట్రాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. స‌చివాల‌యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రుల‌తో సంభాషించారు.

Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్

  అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌ లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచారం సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నవీన్‌ యాదవ్‌పైనా,