hyderabadupdates.com movies మరో దావోస్ గా హైదరాబాద్?

మరో దావోస్ గా హైదరాబాద్?

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్ లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో-అప్ మీటింగ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రమోట్ చేయాలని కోరారు. రేవంత్ ప్రతిపాదనకు సానుకూల మద్దతు లభించింది.

ఈ హైటెక్ యుగంలో వ్యాపారానికి, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిన అవసరముందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఏడాదికి ఒకసారి దావోస్ లో సదస్సు సరిపోదని, మధ్యలో ఒకసారి…దాదాపు 6 నెలల తర్వాత మరో సమావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు.

దావోస్ లో వార్షిక, హైదరాబాద్ లో అర్ధ-వార్షిక సదస్సు నిర్వహిస్తే బాగుంటుందని రేవంత్ చేసిన ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తలు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే పెట్టుబడులు ఆకర్షించే కేంద్రంగా, మరో దావోస్ గా హైదరాబాద్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్, ఏఐ, లైఫ్ సైన్సెస్, ఇతర రంగాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సీఈఓలతో భేటీ అవుతున్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 & ఏఐ హబ్ ఆవిష్కరణ వంటి అంశాలపై చర్చించారు.

Related Post

‘కుబేర’ అక్కడ ఫెయిల్ అయ్యింది ఇందుకే‘కుబేర’ అక్కడ ఫెయిల్ అయ్యింది ఇందుకే

కొన్ని బాక్సాఫీస్ ఫలితాలు అంతుచిక్కవు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి తరహాలో ఎంత విశ్లేషించుకున్నా వాటి వెనుక నిజాలు అర్థం కావు. కుబేరది అలాంటి పరిస్థితే. నెలల క్రితం వచ్చిన సినిమా ప్రస్తావన ఇప్పుడు తేవడానికి కారణం ఉంది. కుబేర నిర్మాణ