hyderabadupdates.com movies మీనాక్షికి మంచి రోజులు వచ్చినట్టే

మీనాక్షికి మంచి రోజులు వచ్చినట్టే

అందం, అభినయం రెండూ చక్కగా ఉండే మీనాక్షి చౌదరి గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ కనిపించనే లేదు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించాక మాములుగా ఎవరైనా వరస సినిమాలతో బిజీ అయిపోతారు. కానీ మీనాక్షి మాత్రం అనగనగా ఒక రాజుకి అంకితమైపోయింది.

మొన్న పండక్కు రిలీజైన ఈ ఎంటర్ టైనర్ నవీన్ పోలిశెట్టి కెరీర్ లో వంద కోట్ల గ్రాసర్ అందించి థియేటర్ రన్ బలంగా కొనసాగిస్తోంది. లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్, సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్, హిట్ 2 ది సెకండ్ కేస్ లో అడివి శేష్ కు మీనాక్షి వల్లే హిట్లు పడ్డాయనే రీతిలో ఆమె అభిమానులు ట్వీట్లు పెట్టారు.

నిజానికి మీనాక్షి చౌదరికి అన్నీ హిట్లే లేవు. 2024లో బ్యాడ్ ఫేజ్ చూసింది. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ మట్కా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అదే ఏడాది కోలీవుడ్ స్టార్ విజయ్ గోట్ లో నటిస్తే దాంట్లోనేమో చనిపోయే పాత్ర ఇచ్చి దర్శకుడు వెంకట్ ప్రభు అన్యాయం చేశారు.

పోనీ గుంటూరు కారంలో మహేష్ బాబు సరసన ఛాన్స్ దొరికిందని సంబరపడితే మెయిన్ హీరోయిన్ శ్రీలీల కావడంతో మీనాక్షి మొక్కుబడిగా మారిపోయింది. తమిళంలో చేసిన సింగపూర్ సెలూన్ కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఒక్క లక్కీ భాస్కర్ మాత్రమే కోరుకున్న విజయం అందించింది. ఇదంతా ఒకే సంవత్సరంలో జరిగిపోయింది.

ఇప్పుడు మళ్ళీ అనగనగా ఒక రాజుతో సాలిడ్ కంబ్యాక్ అందుకుంది. నవీన్ లాంటి టైమింగ్ ఉన్న హీరోతోనూ తనకు సరిపడా స్పేస్ దొరికింది. పెర్ఫార్మన్స్, డాన్స్ రెండూ చూపించే ఛాన్స్ వాడేసుకుంది. నెక్స్ట్ నాగ చైతన్యతో చేసిన వృషకర్మ నిర్మాణంలో ఉంది. ఇది కూడా క్రేజీ ప్రాజెక్టే.

విరూపాక్షతో మెప్పించిన దర్శకుడు కార్తీక్ దండు ఈసారి అంతకన్నా పెద్ద స్కేల్ లో ఈ ఫాంటసీ థ్రిల్లర్ తీస్తున్నారు. తండేల్ ఇచ్చిన సక్సెస్ నిలబెట్టుకునేందుకు చైతు ఈ మూవీకి ఎక్కువ డేట్లు ఇవ్వడంతో పాటు బాగా కష్టపడుతున్నాడు. దీని కోసమే సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ అవకాశాన్ని మీనాక్షి వదులుకుందని ఇన్ సైడ్ టాక్.

Related Post

నిర్మాతల నిర్ణయాలకు హీరోలు నిందలు మోస్తున్నారునిర్మాతల నిర్ణయాలకు హీరోలు నిందలు మోస్తున్నారు

సంక్రాంతి వస్తోందంటే మన బాక్సాఫీస్ దగ్గర ఎంత పోటీ ఉంటుందో.. థియేటర్ల కోసం ఎలాంటి గొడవలు నడుస్తాయో తెలిసిందే. అటు తమిళంలో కూడా సంక్రాంతి క్రేజీ సీజనే. అక్కడ కూడా సినిమాల మధ్య విపరీతమైన పోటీ, థియేటర్ల కోసం గొడవలు కామనే.