hyderabadupdates.com movies వంట గ‌దిలో మొగుడి విధ్వంసం

వంట గ‌దిలో మొగుడి విధ్వంసం

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తో సినిమా చేసే అవ‌కాశాన్ని వ‌దులుకున్న త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సుంద‌ర్.సి.. ఇప్ప‌టికే త‌న‌తో రెండు సినిమాలు చేసిన విశాల్‌తో జ‌ట్టు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. సైలెంటుగా ఆ సినిమాను మొద‌లుపెట్టి కొంత చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిపిన సుంద‌ర్.. స‌డెన్ స‌ర్ప్రైజ్ అన్న‌ట్లుగా ఈ సినిమా టైటిల్ టీజ‌ర్ వ‌దిలాడు. అది చాలా క్రేజీగా సాగి ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇటీవ‌లే రిలీజైన స‌మంత సినిమా మా ఇంటి బంగారం టీజ‌ర్‌తో దీనికి పోలిక ఉండ‌డం విశేషం. పైకి ప‌ద్ధ‌తైన ఇల్లాలిలా క‌నిపిస్తూ… త‌న అత్తారింటిలోనే రౌడీల‌ను మ‌ట్టుబెట్టే పాత్ర‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది స‌మంత‌. సుంద‌ర్ సినిమాలో విశాల్ కూడా ఇలాంటి పాత్రే చేస్తున్న‌ట్లున్నాడు. ఈ సినిమాకు పురుష‌న్ ( తెలుగులో మొగుడు ) అనే టైటిల్ పెట్టిన సుంద‌ర్.. టీజ‌ర్‌తో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యాక్ష‌న్ ప్రియుల‌కూ కావాల్సినంత మ‌సాలా అందించాడు.

ఇంట్లో స‌తీమ‌ణికి సేవ‌లు చేసుకునే ప‌ద్ధ‌తైన భ‌ర్త‌గా విశాల్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేసి.. ఇంటికొచ్చిన అతిథికి టీ పెట్ట‌డం కోసం వంట గ‌దిలోకి వెళ్లి అక్క‌డ త‌న మీద దాడికి వ‌చ్చిన రౌడీ బ్యాచ్ బెండు తీసే నేప‌థ్యంలో ఈ టీజ‌ర్ సాగింది. టీజ‌ర్‌ను ఒక‌లా మొద‌లుపెట్టి.. ఇంకోలా ముగించిన తీరు ఆక‌ట్టుకుంది.

సీరియ‌ల్ న‌టుడి పాత్ర‌లో యోగి బాబు పండించిన హాస్యం టీజ‌ర్లో మేజ‌ర్ హైలైట్. విశాల్ ఇల్లాలి పాత్రలో త‌మ‌న్నా క‌నిపించ‌గా.. భ‌ర్త ముందే ఆమెకు యోగిబాబు సైట్ కొట్ట‌డం.. విశాల్‌ను త‌క్కువ‌గా అంచనా వేసిన అత‌ను త‌ర్వాత వంట గ‌దికి వెళ్లి త‌న విధ్వంసాన్ని చూసి షాక‌వ్వ‌డం.. ఈ క్ర‌మంలో అత‌డి వ‌న్ లైన‌ర్స్ కావాల్సినంత వినోదాన్ని పంచాయి.

సుంద‌ర్ అంటే మాస్ అంశాలు, కామెడీకి కేరాఫ్ అడ్ర‌స్‌. ఐతే త‌న సినిమాలు మ‌రీ రొటీన్‌గా ఉంటాయ‌నే విమ‌ర్శ‌లున్నాయి. పురుష‌న్ కూడా కొత్తగా అనిపించ‌క‌పోయినా.. మాస్ మెచ్చే యాక్ష‌న్, ఎంట‌ర్టైన్మెంట్‌కు లోటు ఉండ‌ద‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మైంది. ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్నాడు. టీజ‌ర్ పూర్త‌య్యాక సుంద‌ర్, త‌మిళ‌, విశాల్ మ‌ధ్య సంభాష‌ణ కూడా ఫన్నీగా సాగడంతో ఈ టీజ‌ర్‌కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

Related Post

సుధీర్ బాబును దేవుడు కూడా కాపాడలేదుసుధీర్ బాబును దేవుడు కూడా కాపాడలేదు

15 ఏళ్ల కెరీర్.. 20 సినిమాలు.. అందులో హిట్లు అని చెప్పుకోదగ్గవి కేవలం మూడు సినిమాలు మాత్రమే. మిగతావన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. ఇదీ సుధీర్ బాబు పరిస్థితి. మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నా.. కథల ఎంపికలో తన అభిరుచిని చాటుకున్నా.. సక్సెస్

ఇకపై ఎవరు పడితే వారు ప్రెస్ అని పెట్టుకోలేరు!ఇకపై ఎవరు పడితే వారు ప్రెస్ అని పెట్టుకోలేరు!

ప్రెస్, ఫలానా ప్రభుత్వ అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా వాహనాల మీద అధికారికంగా స్టిక్కర్లు అంటించడం తప్పేమీ కాదు. అయితే, కొందరు అనధికారికంగా ఆ స్టికర్లు వేసుకొని చలామణీ కావడం తప్పు. ముఖ్యంగా బైకులు, కార్ల మీద ప్రెస్ అని రాసుకొని

ఇక సిగరెట్ ధర రూ.72.. ఇందులో వాస్తవం ఎంత?ఇక సిగరెట్ ధర రూ.72.. ఇందులో వాస్తవం ఎంత?

ఫిబ్రవరి 1 నుంచి ఒక్క సిగరెట్ ధర రూ.72కు పెరుగుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం రూ.15 నుంచి రూ.20 మధ్య ఉన్న సిగరెట్ ధర ఒక్కసారిగా నాలుగు రెట్లు పెరుగుతుందన్న ప్రచారం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది.