hyderabadupdates.com movies లోయలో పడ్డ ఆర్మీ వాహనం… 10 మంది జవాన్లు మృతి

లోయలో పడ్డ ఆర్మీ వాహనం… 10 మంది జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి 200 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో 10 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటన భదర్వా ప్రాంతంలోని ఖన్నీ టాప్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

సైనిక వాహనం ఎత్తైన ప్రాంతంలోని పోస్ట్‌ వైపు వెళ్తుండగా, భదర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ స్థానిక పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. మొదట నలుగురు చనిపోయారని భావించినా, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మృతుల సంఖ్య 10కి పెరిగింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని ప్రత్యేక చికిత్స కోసం ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు.

జవాన్ల నిరుపమాన సేవలను, వారి త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కమాండ్ హాస్పిటల్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంచు కురుస్తున్న ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. ప్రాణాలతో బయటపడిన జవాన్ల కోసం వైద్య బృందాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

Related Post

`బంధానికి` మ‌రో చిక్కు.. స్లీప్ డైవ‌ర్స్‌లో భార‌త్ ఫస్ట్!`బంధానికి` మ‌రో చిక్కు.. స్లీప్ డైవ‌ర్స్‌లో భార‌త్ ఫస్ట్!

అన్యోన్య కాపుర‌మే.. వైవాహిక బంధానికి.. చూడ‌ముచ్చ‌టైన జంట‌కు.. నిద‌ర్శ‌నం. అయితే.. కార‌ణాలు ఏవైనా ఇప్పుడు ఈ బంధానికి ఇప్పుడు `స్లీప్ డైవ‌ర్స్‌` చిక్కులు తెస్తోంది. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగిన ఓ స‌ర్వేలో `స్లీప్ డైవ‌ర్స్‌` విష‌యంలో భార‌త్ ముందుంద‌ని తేలింది.

ఈరోజు కృష్ణ గారు బ్రతికి ఉండుంటే…ఈరోజు కృష్ణ గారు బ్రతికి ఉండుంటే…

సూపర్ స్టార్ కృష్ణ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని కెరీర్ ఆరంభంలోనే పేరు సంపాదించాడు మహేష్ బాబు. కొన్నేళ్లకు తండ్రికి మించిన తనయుడు అని కూడా అనిపించుకున్నాడు. తండ్రికి ఉన్న సూపర్ స్టార్ బిరుదును అభిమానులు కొడుక్కీ