hyderabadupdates.com movies చైతు లవ్ స్టోరీకి సరైన సమయం

చైతు లవ్ స్టోరీకి సరైన సమయం

నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయిన లవ్ స్టోరీని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. 2021లో విడుదలయ్యాక మళ్ళీ దీన్ని థియేటర్లకు తీసుకురాలేదు. అయిదు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులకు మరోసారి చూపించబోతున్నారు.

అయితే పది ఇరవయ్యేళ్ళ పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఓకే కానీ లవ్ స్టోరీ చాలా మంది మూవీ లవర్స్ కి ఇంకా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకొంచెం ఆగి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం కావడం సహజం. కానీ నిర్మాతల ఆలోచన వేరేలా కనిపిస్తోంది. ఒక పాజిటివ్ యాంగిల్ గమనించవచ్చు.

సంక్రాంతి హడావిడి అయిపోయాక బాక్సాఫీస్ కు కొత్త ఆప్షన్లు లేకుండా పోయాయి. దీంతో నెలాఖరు వరకు వాటితోనే సర్దుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు లవ్ స్టోరీ వచ్చే దాకా సిచువేషన్ కొంచెం డ్రైగానే ఉంటుంది. సో ఈ సీజన్ వాడుకోవచ్చు. ముఖ్యంగా వాలెంటైన్ డే రోజు ప్రేమికులు తమ ఫస్ట్ ఛాయస్ గా లవ్ స్టోరీని పెట్టుకునే అవకాశం లేకపోలేదు.

అయితే అదే రోజు రామ్ చరణ్ ఆరంజ్ మళ్ళీ తీసుకొస్తున్న సందర్భంగా రెండింటి మధ్య క్లాష్ ఎలా ఉంటుందో చూడాలి. ఆరంజ్ ఆల్రెడీ ఒకటి రెండ్లు బాగా ఆడేసి వెళ్ళిపోయింది. ముచ్చటగా మరోసారి చూపించేందుకు నాగబాబు రెడీ అయ్యారు.

తండేల్ తర్వాత చైతు ఆల్రెడీ ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. వృషకర్మ ఇంకా విడుదల డేట్ ఫిక్స్ కాలేదు. సో తనను తెరమీద సెలెబ్రేట్ చేసుకోవాలనుకునే ఫ్యాన్స్ కి లవ్ స్టోరీ మంచి ఆప్షన్ అవుతుంది. నిజానికి వాళ్ళు ముందు నుంచి డిమాండ్ చేస్తోంది జోష్ ని. అయితే నిర్మాత దిల్ రాజు దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈలోగా లవ్ స్టోరీ ఈ రకంగా అవకాశాన్ని వాడుకుంటోంది. చైతునే కాదు సాయిపల్లవి ఫ్యాన్స్ కూడా ఇందులో భాగం కాబోతున్నారు. ముఖ్యంగా సారంగదరియా పాట థియేటర్లలో మోగిపోవడం ఖాయం. నారంగ్ ఫ్యామిలీ ప్రమోషన్లను కొత్త సినిమా రేంజ్ లో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోందట.

Related Post

బీజేపీ విజయానికి కాంగ్రెస్ నేత సంబ‌రాలు!బీజేపీ విజయానికి కాంగ్రెస్ నేత సంబ‌రాలు!

కేర‌ళ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ విజ‌యం ద‌క్కించుకుంది. కేర‌ళ‌లోని రాజ‌ధాని న‌గ‌రం తిరువ‌నంత‌పురంలో తాజాగా జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ 50 స్థానాలు ద‌క్కించుకుని అతి పెద్ద‌పార్టీగా అవ‌త‌రించింది. దాదాపు 45 ఏళ్ల త‌ర్వాత‌.. బీజేపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఒక ఎత్తు