hyderabadupdates.com movies మిసెస్ చైతు ‘చీకటిలో’ వెలుగు ఉందా

మిసెస్ చైతు ‘చీకటిలో’ వెలుగు ఉందా

అక్కినేని నాగచైతన్య భాగస్వామిగా తన జీవితంలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ స్వతహాగా నటి అయినప్పటికీ తెరమీద రెగ్యులర్ గా కనిపించడం ఉండదు. తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి రెండు మూడు మూవీస్ తప్ప కంటిన్యూగా సినిమాలు చేయాలనే తాపత్రయం చూపించలేదు. ఎప్పుడైతే చైతు లైఫ్ పార్ట్ నర్ గా మారిపోయిందో అప్పటి నుంచి నాగ్ ఫ్యాన్స్ కు తనతో ఒక బాండింగ్ ఏర్పడిపోయింది.

పెళ్ళయాక తను నటించిన మొదటి మూవీ చీకటిలో తాజాగా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ని చైతుతో పాటు పలువురు ఇండస్ట్రీ సెలబ్రిటీలకు ప్రత్యేక ప్రీమియర్ వేశారు.

చీకటిలో రూపంలో శోభితకు కంబ్యాక్ దొరికిందా అంటే ముందు దాంట్లో ఏముందో చూడాలి. కథ పరంగా మరీ డిఫరెంట్ గా అనిపించదు. సంధ్య అనే టీవీ జర్నలిస్ట్ తన ఉద్యోగంలో రాజీ పడలేక స్వంతంగా పాడ్ క్యాస్ట్ పెట్టుకుంటుంది. స్నేహితురాలు బాబీతో పాటు ఆమె ప్రియుడు దారుణంగా హత్యలకు గురయ్యాక దీని వెనుక ఉన్న నిజాలు తేల్చేందుకు రంగంలోకి దిగుతుంది.

అయితే ఫోన్ చేసి మరీ హత్యలు చేసే ఆ సైకో కిల్లర్ ఎవరో అర్థం కాక డిపార్ట్ మెంట్ కష్టపడుతున్న టైంలో సంధ్య వాళ్లకు తోడుగా నిలబడుతుంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చివరికి అసలు హంతకుడిని పట్టిస్తుంది.

స్టోరీగా చూస్తే ఇదో మాములు క్రైమ్ థ్రిల్లర్. దర్శకుడు శరన్ కోపిశెట్టి దీన్ని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో నడిపించడంలో తడబడ్డాడు. ఇన్వెస్టిగేషన్ మరీ నెమ్మదిగా సాగడంతో వేగం కోరుకునే ప్రేక్షకులు బోర్ గా ఫీలవుతారు. స్పెషల్ ఆఫీసర్ గా ఈషా చావ్లా ఎంట్రీ తర్వాత కూడా కథనం స్లోగానే వెళ్ళడంతో ఎగ్జైట్ మెంట్ అంతకంతా తగ్గిపోతుంది.

ఎంత రొటీన్ గా ఉన్నా పరవాలేదనుకుంటే తప్ప చీకటిలో లీనమవ్వడం కష్టం. పెర్ఫార్మన్స్ పరంగా శోభిత ఓకే అనిపించుకుంది. సాలిడ్ కంబ్యాక్ అయ్యే అవకాశాన్ని చీకటిలో ఇవ్వకపోవచ్చు కానీ ఇలాంటి జానర్ లో బలమైన సబ్జెక్టులు చేస్తే మాత్రం మంచి ఇన్నింగ్స్ నిర్మించుకోవచ్చు.

Related Post

Sankranthi 2026: A Grand Start for Telugu CinemaSankranthi 2026: A Grand Start for Telugu Cinema

Five Telugu films Prabhas’ Raja Saab, Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu, Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi, Naveen Polishetty’s Anaganaga Oka Raju and Sharwanand’s Naari Naari Naduma Murari released during

టైసన్ నాయుడుకి మోక్షం దొరికేదెలాటైసన్ నాయుడుకి మోక్షం దొరికేదెలా

అల్లుడు అదుర్స్ తర్వాత ఛత్రపతి హిందీ రీమేక్ కోసం చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ గత ఏడాది భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది ఆశించిన ఫలితం అందుకోకపోయినా, అనుకున్న దాని కన్నా ఎక్కువగా కిష్కిందపురి వర్కవుట్