hyderabadupdates.com Gallery 25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్

25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్

25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్ post thumbnail image

తిరుమ‌ల : శ్రీ‌వారి ఆల‌యంలో ఈనెల 25న ర‌థ స‌ప్త‌మి నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు గాను శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవ‌లు, ప్రివిలేజ్ ద‌ర్శ‌నాలు, ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మిన‌హా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ఉండ‌వ‌న్నారు. ఎక్కువ మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌నే ఉద్దేశంతో తిరుపతిలో జ‌న‌వ‌రి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ కూడా ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ర‌థ స‌ప్త‌మి రోజు భ‌క్తుల‌కు పంపిణీ చేసేందుకు 14 ర‌కాల మెనూ త‌యారీ. గ్యాల‌రీల్లోని భ‌క్తులంద‌రికీ 85 ఫుడ్ కౌంట‌ర్ల ద్వారా ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు అన్న ప్ర‌సాదాలు అందేలా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌న్నారు.
వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు వినియోగించు కోనున్న‌ట్లు తెలిపారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. 1300 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామ‌న్నారు. భ‌ద్ర‌త‌కు సంబంధించి STANDARD OPERATION PROCEDURE ను అనుస‌రిస్తూ టీటీడీ భ‌ద్ర‌తా విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న‌ట్లు చెప్పారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు లాగే ఈసారి కూడా తిరుమ‌ల‌లో జ‌రిగే ర‌థ‌స‌ప్త‌మి సంద‌ర్బంగా కేవ‌లం సామాన్య భ‌క్తుల‌కే అత్య‌ధికంగా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
The post 25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తిరుమ‌ల‌లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవంతిరుమ‌ల‌లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గం.ల నుండి అర్థరాత్రి 12

సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారుసూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారు

హైద‌రాబాద్ : లోకం ఉన్నంత దాకా ఎన్టీఆర్ బ‌తికే ఉంటార‌ని అన్నారు ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో

డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్

అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు