hyderabadupdates.com Gallery జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌

జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌

జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌ post thumbnail image

విజ‌య‌వాడ : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గ‌త 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. అందుకే జ‌నం ఛీ కొట్టార‌ని, కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని అయినా బుద్ది రావ‌డం లేద‌ని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అటువంటి దారుణాలు ఎక్కడ జరిగాయో మీరు చూపించాలని అన్నారు. రోడ్లపైకి వచ్చి రౌడీ లాగా దాడులు చేస్తే అరెస్టులు చేయకూడదా? అని ప్ర‌శ్నించారు బుద్దా వెంక‌న్న‌. ఉచ్చ నీచాలు మరచి మాట్లాడిన వారిపై కేసులు పెడితే అరాచకమా అని నిల‌దీశారు. నా తండ్రి సమకాలికుడు చంద్రబాబు అని ఈరోజు జగన్ వ్యాఖ్యానించడం దారుణ‌మ‌న్నారు. ఇదేం సంస్కారం అని, బుద్ధి ముందు నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి కి ఇంత ఘోర ఓటమి ఉండేది కాద‌న్నారు.
జగన్ అధికారంలో ఉండగా కొడాలి నాని, ద్వారంపూడి వంటి వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటే నువ్వేం చేసావ్ జగన్ అంటూ ఫైర్ అయ్యారు. వారిని నిరోధించాల్సిన జగన్ ముసి ముసిగా నవ్వుకుంటూ వాళ్లను ప్రోత్సహించారని ఆరోపించారు బుద్దా వెంక‌న్న. దేవత లాంటి భువనేశ్వరిని ఎన్ని మాటలు ఎప్పుడన్నారో ఆనాడే టిడిపికి ఓటు వేయాలని ప్రజల నిర్ణయించుకున్నారని అన్నారు. వాళ్లు నోరు పారేసుకున్న రోజే ఖండించి ఉంటే బాగుండేదన్నారు. భువనేశ్వరి అమ్మ కూడా నా తల్లి వయసు లాంటిది చెప్పాల్సి ఉందన్నారు. ఇప్పుడు మాత్రం చిలక పలుకులు పలుకుతున్న జగన్ కు ఆరోజు ఇటువంటి సంస్కారం ఎందుకు గుర్తు రాలేన్నారు.
The post జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Anant Singh: జన్ సురాజ్ కార్యకర్త హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టుAnant Singh: జన్ సురాజ్ కార్యకర్త హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు

Anant Singh : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన్‌సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దులార్‌చంద్‌ హత్య

ఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధంఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధం

త‌మిళ‌నాడు : ఏపీ, తమిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ది అన్న‌ద‌మ్ముల అనుబంధం ఉంద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తమిళనాడు ఎన్నిక‌ల సంద‌ర్బంగా మంగళ‌వారం జ‌రిగిన‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో

Karumuru Venkat Reddy: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్‌Karumuru Venkat Reddy: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్‌

    వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. వెంకట్‌రెడ్డిపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీశ్‌కుమార్‌ ఈనెల