hyderabadupdates.com Gallery రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్

రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్

రామ్ చరణ్  డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్ post thumbnail image

హైద‌రాబాద్ : మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీ నిర్మాత‌, చిరంజీవి ముద్దుల కూతురు సుస్మిత కొణిద‌ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న సోద‌రుడు, ప్ర‌ముఖ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ డ్రెస్సింగ్ గురించి స్పందించింది. రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తార‌ని తెలిపారు. అదే ప‌నిగా ఫ్యాషన్ ట్రెండ్‌లను గుడ్డిగా అనుసరించే వ్యక్తి కాదని పేర్కొంది. ఆర్ ఆర్ఆర్ మూవీ హీరో త‌న వ్య‌క్తిగ‌త శైలి గురించి చాలా స్ప‌ష్టంగా ఉంటార‌ని , ప్రస్తుతం ఫ్యాషన్‌లో ఉన్న వాటి కంటే తన శరీర ఆకృతికి సరిపోయే దుస్తులనే ఇష్టపడతారని ఆమె పంచుకున్నారు. సుస్మిత కొణిద‌ల ప్రకారం రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేసింది.
తాను ధరించే దుస్తుల విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటారని తెలిపింది సుష్మిత కొణిద‌ల‌. తనకు బాగా సరిపోయే దుస్తులను ఎంచుకోవడానికి సమయం తీసుకుంటారని పేర్కొంది. తెరపై అయినా, తెర వెనుక అయినా, అతని సహజమైన హుందాతనం, ఆత్మ విశ్వాసం ఏ దుస్తులనైనా సులభంగా ధరించడానికి వీలు కల్పిస్తాయని తెలిపింది. ఇదిలా ఉండ‌గా మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీతో తొలిసారిగా నిర్మాత‌గా మారారు. ఇందులో త‌న తండ్రి ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవిని హీరోగా పెట్టి తీసింది. ఇది ఊహించ‌ని రీతిలో ఏకంగా వారం రోజుల్లోనే రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. రికార్డుల మోత మోగించింది. ఈ మూవీలో చిరంజీవి ధ‌రించిన దుస్తులు సైతం ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.
The post రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

AP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదంAP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఇవాళ జరిగిన

Manoj Kumar Katiyar: మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్‌‌‌‌‌ కు స్ట్రాంగ్ వార్నింగ్Manoj Kumar Katiyar: మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్‌‌‌‌‌ కు స్ట్రాంగ్ వార్నింగ్

Manoj Kumar Katiyar : పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని భారత వెస్ట్రన్ కమాండ్‌ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ (Manoj Kumar Katiyar) హెచ్చరించారు. అయితే ఈ సారి మామూలుగా ఉండదు…

CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌

    కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్‌ బంధం లేకపోతే జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు