hyderabadupdates.com Gallery బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ post thumbnail image

ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ధురంధ‌ర్. పాకిస్తాన్ లో ఇండియ‌న్ ఆఫీస‌ర్ గూఢ‌చారిగా వ్య‌వ‌హ‌రించిన క‌థ‌నం ఆధారంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంది. ఏకంగా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ సినిమాను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అయితే ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుంద‌నే దానిపై అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. తెర‌పై స‌త్తా చాటిన ఈ మూవీ బిగ్ షాక్ ఇచ్చింది. సినీ వ‌ర్గాలు సైతం విస్తు పోయేలా కాసుల వ‌ర్షం కురిపించింది. తెర‌పై అద్భుత స‌క్సెస్ ను మూట‌గ‌ట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిట‌ల్ రంగ ప్ర‌వేశానికి రెడీ అవుతోంది. అద్భుత‌మైన చిత్రీక‌ర‌ణ‌, ఆక‌ట్టుకునే సంభాష‌ణ‌లు, అంత‌కు మించి ర‌ణ్ వీర్ సింగ్ , సారా జాన్స‌న్ న‌టన అభిమానుల‌ను విస్మ‌య ప‌రిచింది.
ఇదిలా ఉండ‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద ఎత్తున దురంధ‌ర్ మూవీ స్ట్రీమింగ్ పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 30న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని టాక్. దీనిపై బ‌ల‌మైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారిక ఓటీటీ విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమ్ చేయవచ్చని పుకార్లు వస్తున్నాయి, అయితే ఇది కూడా అధికారికంగా ధృవీకరించ లేదు సంస్థ‌. ఇక దురంధ‌ర్ మూవీ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారాడు అక్ష‌య్ ఖ‌న్నా. త‌ను ఈ సినిమాకు అస్సెట్ అయ్యాడ‌న‌డంలో సందేహం లేదు.
The post బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

భ‌ట్టి విక్ర‌మార్క సింగ‌రేణి స్కాం అబ‌ద్దం : సీఎంభ‌ట్టి విక్ర‌మార్క సింగ‌రేణి స్కాం అబ‌ద్దం : సీఎం

హైద‌రాబాద్ : రాష్ట్రంలో తాజాగా రాధాకృష్ణ ఆధ్వ‌ర్యంలోని ఆంధ్ర‌జ్యోతిలో సింగ‌రేణి లో స్కాం జ‌రిగింద‌ని, దీనిలో ముఖ్య‌మైన పాత్ర రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పాత్ర ఉందంటూ బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు డిప్యూటీ

Amit Shah: జోహో మెయిల్‌కు మారిన అమిత్‌ షాAmit Shah: జోహో మెయిల్‌కు మారిన అమిత్‌ షా

    దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపును కేంద్రమంత్రులు అందిపుచ్చుకుంటున్నారు. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, డిజిటల్ ఇండియాలో భాగంగా ‘జోహో’ ప్లాట్‌ఫామ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా.. కేంద్ర