hyderabadupdates.com Gallery మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావించారు. వారు లేక‌పోతే ఈ స‌మాజం మ‌నుగ‌డ సాధించ‌ద‌ని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం సీఎం మీడియాతో మాట్లాడారు. బాలికలకు సాధికారత కల్పించి, రక్షించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. ఇవాళ జాతీయ బాలికా దినోత్సవం దేశ వ్యాప్తంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా బాలికలకు సాధికారత కల్పించే లక్ష్యానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.
ప్రజలు తమను తాము పున‌రంకితం చేసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం అని ముఖ్యమంత్రి అన్నారు. కుమార్తెలకు సాధికారత కల్పించి, రక్షించి, విజయం సాధించడానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఒక సమాజం నిజమైన పురోగతిని సాధిస్తుందని ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. అందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెలకు సాధికారత కల్పించి, రక్షించి, విజయం సాధించడానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఒక సమాజం ముందుకు సాగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించి, దేశ నిర్మాణంలో చురుకైన భాగస్వామ్యం వహించేలా వారిని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండ‌గా మ‌హిళ‌ల‌కు సంబంధించి కీల‌క సూచ‌న‌లు చేశారు. త‌మ స‌ర్కార్ ఏపీలో కొలువు తీరిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని రీతిలో బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల సంక్షేమం , సాధికార‌త దిశ‌గా అడుగులు వేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
The post మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీబంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీ

దుబాయ్ : భ‌ద్ర‌తా కార‌ణాల పేరుతో వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రిలో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో తాము పాల్గొనేది లేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేర‌కు త‌మ‌కు ప్ర‌త్యామ్నాయ మైదానాలు

Wife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్యWife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్య

  ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం

Red Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియోRed Fort Bomber: సూసైడ్‌ బాంబింగ్‌ పై డాక్టర్‌ ఉమర్‌ నబీ సంచలన వీడియో

    దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మురం చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీ వీడియో బయటపడింది. ఎర్రకోట వద్ద కారు బాంబు