hyderabadupdates.com movies పవన్ అభిమానులతో హరీష్ రాజీ

పవన్ అభిమానులతో హరీష్ రాజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అత్యంత ఆనందాన్నిచ్చి, వారిని తీవ్ర భావోద్వేగానికి గురి చేసిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. దాదాపు పదేళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న పవన్‌కు 2012లో ‘గబ్బర్ సింగ్’ రూపంలో మరపురాని హిట్ ఇచ్చిన ఘనత హరీష్‌దే. పేరుకు అది రీమేక్ మూవీనే కానీ.. ‘దబంగ్’ నుంచి కేవలం స్టోరీ లైన్ మాాత్రమే తీసుకుని దాని ట్రీట్మెంట్ మొత్తం మార్చేసి.. పవన్‌ను పవర్ ఫుల్‌గా చూపించి అభిమానులను ఉర్రూతలూగించాడు హరీష్.

స్వయంగా పవన్‌కు హరీష్ వీరాభిమాని కావడంతో.. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా తన హీరోను చూపించాడు. ఆ సినిమా చూశాక హరీష్‌కు పవన్ ఫ్యాన్స్ తమ గుండెల్లో గుడి కట్టేశారు. పవన్ అభిమానులతో హరీష్‌ది ప్రత్యేక అనుబంధం. కానీ కొన్నేళ్ల ముందు ఆ బంధం బ్రేక్ అయింది. పదేళ్లకు పైగా విరామం తర్వాత పవన్‌తో హరీష్ సినిమా చేయబోతుంటే.. పవర్ ఫ్యాన్సే దాన్ని వ్యతిరేకించారు. కారణం.. ఇది రీమేక్ అన్న ప్రచారం జరగడమే.

తమిళ హిట్ ‘తెరి’కి ఇది రీమేక్ అని రూమర్స్ రావడంతో ఈ సినిమా వద్దే వద్దు అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉద్యమం చేశారు. అప్పటికే రీఎంట్రీలో పవన్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తుండడంతో విసుగెత్తిపోయి ఈ సినిమాను కూడా వ్యతిరేకించారు. ఐతే సినిమాలో ఏముందో తెలియకుండా ముందే ఇలా వ్యతిరేకించడంతో హరీష్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎక్స్‌లో తనను తిట్టే వాళ్లను, ఈ సినిమాను వ్యతిరేకించేవాళ్లను వరుసబెట్టి బ్లాక్ చేసుకుంటూ వెళ్లాడు.

ఇలా వందల అకౌంట్లను బ్లాక్ చేశాడు. వారిలో ఎక్స్‌లో బాగా పాపులర్ అయిన పవన్ కల్ట్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ ఎన్నిసార్లు విన్నవించినా హరీష్ కరగలేదు.ఐతే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదనే సంకేతాలు రావడం, ఇంతకుముందు ఈ చిత్రం మీద ఉన్న నెగెటివిటీ పక్కకు వెళ్లిపోవడం, పైగా సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండడంతో పవన్ అభిమానుల్లో మార్పు వచ్చింది.

హరీష్‌కు సారీ చెప్పి మరీ అన్ బ్లాక్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. హరీష్ సైతం మనమంతా ఒక ఫ్యామిలీ అని పేర్కొని.. వరుసగా ఫ్యాన్స్ అకౌంట్లన్నీ అన్ బ్లాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా హరీష్, పవన్ ఫ్యాన్స్ ఒక రాజీకి వచ్చి మళ్లీ కలిసి పోతుండడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ ముంగిట మంచి పరిణామమని కో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Related Post

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలుపరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల భ‌క్తుల‌పై తీవ్ర ప్ర‌భావం కూడా చూపించింది. వీటి విలువ 70 వేలు. అయితే.. ఈ కేసులో రాజీ చేసుకోవ‌డంతోపాటు.. ఫిర్యాదు

ఇక్కడ 700 కోట్లు… అక్కడ 100 కోట్లేఇక్కడ 700 కోట్లు… అక్కడ 100 కోట్లే

సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా స్పెషల్. అక్కడ కూడా పది రోజుల పాటు సెలవులుంటాయి. దీంతో ఈ సీజన్లో భారీ చిత్రాలు బాక్సాఫీస్ రేసులో నిలుస్తుంటాయి. ఈసారి విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ సంక్రాంతి బరిలో నిలవడంతో