hyderabadupdates.com movies ‘ఈసారి తెలంగాణలో వచ్చేది జాగృతి ప్రభుత్వమే’

‘ఈసారి తెలంగాణలో వచ్చేది జాగృతి ప్రభుత్వమే’

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తన సోదరుడు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలపై, సీఎం రేవంత్ రెడ్డిపై కవిత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో కవిత చేరతారని ప్రచారం జరుగుతున్నా…అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అని, కానీ, తాను వ్యతిరేకిస్తున్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేసినట్టు తిరిగిన వార్తలు డిబేట్ కు దారి తీసాయి.

ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ కు కవిత కౌంటరిచ్చారు. ఓ చిట్ చాట్ సందర్భంగా తాను కాంగ్రెస్ లోకి వస్తానంటే మహేష్ కుమార్ వద్దన్నారని ప్రచారం జరుగుతోందని, దానిని ఖండించారు. తాను కాంగ్రెస్‌లో చేరనని, అసలు ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదని కవిత జోస్యం చెప్పారు.

అంతేకాదు, మహేష్ అన్న జాగృతి పార్టీలో చేరాలని, భవిష్యత్తులో తాను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. మహేష్ గౌడ్‌ కు జాతీయ కన్వీనర్ గా తన పార్టీలో కీలక పదవి ఇస్తానని కవిత చెప్పారు. తన పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతేగానీ, తనను బద్నాం చేయొద్దని కోరారు. ఒకవేళ తాను కాంగ్రెస్ లోకి వస్తానని మహేషన్నకు కల వచ్చిందేమోనని, ఎవరికైనా చూపించుకోవాలని సెటైర్లు వేశారు. తన కొత్త పార్టీకి సంబంధించి కమిటీల నియామకం వంటి ప్రక్రియలో బాగా బిజీగా ఉన్నామని, పకడ్బందీగా పార్టీని సెట్ చేసుకునే పనిలో ఉన్నామని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ముందడుగు వేస్తామని, అప్పటి వరకు ఇటువంటి ప్రకటనలు, ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు.

Big Statement by Jagruthi Kavitha!”మహేష్ అన్నా… కాంగ్రెస్ లో ఏం లేదు, అది ఓడిపోయే పార్టీ.ఈసారి వచ్చేది జాగృతి ప్రభుత్వమే. మీరే మా పార్టీలోకి రండి… మంచి పోస్ట్ ఇస్తా.”– #Kavitha pic.twitter.com/IvsbHyBKLb— Gulte (@GulteOfficial) January 25, 2026

Related Post

పిఠాపురానికి ముంద‌స్తు సంక్రాంతి!పిఠాపురానికి ముంద‌స్తు సంక్రాంతి!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురంలోనే ఉండ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న