ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన పవన్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా సనాతన ధర్మ సంబంధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే నాందేడ్ లో సచ్ ఖండ్ గురుద్వారాను పవన్ నేడు సందర్శించారు. ప్రముఖ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు.
గురుద్వారాను సందర్శించిన పవన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంప్రదాయబద్ధంగా సిక్కుల తలపాగా చుట్టిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ లా కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పవన్ వెంట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవాన్ ఉన్నారు. అనంతరం, శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో కాసేపు గడిపారు. ఉత్తరాదిలో కూడా పవన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.