hyderabadupdates.com movies యాటిట్యూడ్ స్టార్… ఇంకా తగ్గలేదుగా

యాటిట్యూడ్ స్టార్… ఇంకా తగ్గలేదుగా

తెలుగులో చాలామంది స్టార్లు ఉన్నారు. వారికి ర‌క‌ర‌కాల ట్యాగ్స్ ఉన్నాయి. కానీ యాటిట్యూడ్ స్టార్ అని ఒక ట్యాగ్ పెట్టుకుని ఓ హీరో వ‌స్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. ఈటీవీ ప్ర‌భాక‌ర్ త‌న‌యుడైన చంద్ర‌హాస్.. త‌న తొలి సినిమా లాంచ్ ఈవెంట్లో స్టేజ్ మీద ఇచ్చిన హావ‌భావాలు సోష‌ల్ మీడియాలో ట్రోల్ మెటీరియ‌ల్‌గా మారి.. అత‌డికి నెటిజ‌న్లు వ్యంగ్యంగా యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ లైన్ ఇచ్చారు.

దీన్ని స్పోర్టివ్‌గా తీసుకుని అదే ట్యాగ్ లైన్‌తో సినిమాలు చేస్తున్నాడు చంద్ర‌హాస్. అంతే కాదు.. నెగెటివ్‌గా అయినా త‌న‌కు పాపులారిటీ తెచ్చిపెట్టింది త‌న యాటిట్యూడే కాబ‌ట్టి.. త‌ర్వాత కూడా అత‌ను దాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నాడు. త‌న లాస్ట్ మూవీ రామ్ న‌గ‌ర్ బ‌న్నీ రిలీజైన‌పుడు సినిమా న‌చ్చ‌క‌పోతే టికెట్ డ‌బ్బులు వాప‌స్ ఇస్తా అంటూ ప్ర‌మోష‌న్ల‌లో చాలా హ‌డావుడి చేశాడు చంద్ర‌హాస్. ఆ సినిమా ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది.

ఇప్పుడు అత‌ను ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్‌తో వార్త‌ల్లోకి వ‌చ్చాడు. త‌న కొత్త చిత్రం బ‌రాబ‌ర్ ప్రేమిస్తా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..ఇండ‌స్ట్రీలో నెపోటిజం గురించి ఎదురైన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చాడు.

తాను ఈటీవీ ప్ర‌భాక‌ర్ కొడుకు కాక‌పోయి ఉంటే త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఇంకా ఎక్కువ అవ‌కాశాలు వ‌చ్చేవ‌ని అత‌న‌న్నాడు. చిన్న‌వి, పెద్ద‌వి అన్న‌ది సంబంధం లేకుండా ఇంకా ఎక్కువ క్యారెక్ట‌ర్లు, సినిమాలు చేసేవాడిని అత‌ను పేర్కొన‌డం విశేషం. ఈటీవీ ప్ర‌భాక‌ర్ కొడుకు కాకపోయి ఉండి, త‌న‌ను ఇంకోలా ట్రీట్ చేసి ఉంటే పిచ్చ లైట్ అని అత‌ను కామెంట్ చేశాడు.

చంద్ర‌హాస్ మాట‌ల్ని బ‌ట్టి చూస్తే ప్ర‌భాక‌ర్ కొడుకు కావ‌డం వ‌ల్ల అత‌డికి అవ‌కాశాలు ఎక్కువ‌గా రావ‌ట్లేదు అన్న‌ట్లుంది. మ‌రి అంత బ్యాగేజ్ అత‌నేం మోస్తున్నాడో మ‌రి. ఈ కామెంట్ చూసి ఈ కుర్రాడిలో యాటిట్యూడ్ త‌క్కువేమీ లేద‌ని.. అత‌డికి ఆ ట్యాగ్ లైన్ ఇవ్వ‌డంలో త‌ప్పేమీ లేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

సంప‌త్ రుద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బ‌రాబ‌ర్ ప్రేమిస్తా ఫిబ్ర‌వ‌రి 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో చంద్ర‌హాస్ స‌ర‌స‌న మేఘ‌నా చౌద‌రి క‌థానాయికగా న‌టించింది.

Related Post