hyderabadupdates.com Gallery జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌

జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌

జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌ post thumbnail image

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో షోరూం య‌జ‌మానులు స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఈ మేర‌కు గురువారం ఆయ‌న స్వ‌యంగా రంగంలోకి దిగారు. షో రూంల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అంతే కాకుండా న‌గ‌రంలో షాపుల‌తో పాటు వాణిజ్య స‌ముదాయాల్లో హైడ్రా క‌మిష‌న‌ర్ ముమ్మ‌రంగా త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే జూబ్లీహిల్స్ రోడ్డు నంబ‌రు 36లో ఉన్న నీరూస్ షోరూంను సంద‌ర్శించారు. య‌జ‌మాని నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మూడు సెల్లార్లు, నాలుగు అంత‌స్తుల‌కు తోడు పైన అనుమ‌తి లేని రూఫ్ షెడ్డు వేసి వ‌స్త్రాల‌తో నింపేయ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. రెండు అంత‌స్తుల్లో అమ్మ‌కాలు, పైన మూడు అంత‌స్తుల్లో వ‌స్త్రాల త‌యారీ, గోదాములా పెద్ద‌మొత్తంలో నిలువ‌లు ఉంచ‌డంప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
ఫైర్ ఎన్వోసీ లేకుండా షాపుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు క‌మిష‌న‌ర్ త‌నిఖీల్లో తేలింది. ఫైర్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌క పోవ‌డ‌మే కాకుండా.. ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్ (మంట‌ల‌ను ఆర్పేది) లు కూడా స‌రిగా లేక‌పోవ‌డాన్ని గ‌మ‌నించారు. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌లు పాటించ‌క పోవ‌డంతో సీజ్ చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. హైడ్రా, ఫైర్, జీహెచ్ ఎంసీ, విద్యుత్ శాఖ‌ల‌కు చెందిన అధికారులు ఈ త‌నిఖీల్లో ఉన్నారు. ఫైర్ అన్ సేఫ్ షాపుగా పేర్కంటూ బోర్డుల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా.. హైడ్రా ఫెన్సింగ్ వేసింది. విద్యుత్ అధికారులు ప‌వ‌ర్ స‌ప్లైను బంద్ చేశారు.
The post జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Fire Crackers: దీపావళి ముందు సిక్కింలో బాణాసంచాపై నిషేధంFire Crackers: దీపావళి ముందు సిక్కింలో బాణాసంచాపై నిషేధం

    దీపావళికి ముందు ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బాణాసంచాను నిషేధించింది. అన్ని రకాల సౌండ్, ఫైర్‌క్రాకర్ల తయారీ, విక్రయం, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. అదే సమయంలో పండుగ సందర్భంగా సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల వాడకాన్ని నివారించాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చింది. బదులుగా

CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌CJI BR Gavai: పూర్తి సంతృప్తితో వెళ్తున్నా – సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రజలకు తన వంతు సేవలు అందించానని, పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేయబోతున్నానని సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల ఈ ప్రస్థానం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. న్యాయరంగ

రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రంరూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం

పెనుకొండ : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. పెనుకొండకు ప్రతిష్టాత్మకమైన ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ రానుందంటూ వెల్ల‌డించారు.. రూ.425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు