hyderabadupdates.com Gallery అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ఆవిష్క‌ర‌ణ

అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ఆవిష్క‌ర‌ణ

అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ఆవిష్క‌ర‌ణ post thumbnail image

విశాఖ‌పట్నం జిల్లా : అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ను ఆవిష్క‌రించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లిలో అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించేందుకు నిర్ణ‌యం తీసుకుంది ఏపీ స‌ర్కార్. ఇందులో భాగంగా భారీ ఎత్తున నిధుల‌ను మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌. గురువారం అనకాపల్లి ఉత్సవ్ నేపథ్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన వేదికతోపాటు ఆహుతులకు అవసరమైన సౌకర్యాల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు వంగ‌ల‌పూడి అనిత‌. ఈ సందర్భంగా అనకాపల్లి ఉత్సవ్ కు సంబంధించిన థీమ్ సాంగ్, పోస్టర్ ను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ , కలెక్టర్ విజయకృష్ణన్ , ఎస్పీ తుహీన్ సిన్హా , ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి లాంచ్ చేశారు.
ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింద‌ని చెప్పారు హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. వెల్దీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మందుకు వెళుతున్నామ‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా స‌మ‌ర్థ‌వంతుడైన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి. ఇప్ప‌టికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉత్స‌వ్ పేరుతో కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతూ వ‌స్తున్నామ‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌. అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ కోసం భారీ ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌వుతార‌ని, ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు అనిత వంగ‌ల‌పూడి.
The post అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ థీమ్ సాంగ్ ఆవిష్క‌ర‌ణ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్

తిరుమ‌ల : శ్రీ‌వారి ఆల‌యంలో ఈనెల 25న ర‌థ స‌ప్త‌మి నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు గాను శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవ‌లు,

PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీPM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

    ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 21-23వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ

హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హైద‌రాబాద్ : ద‌ర్శ‌క‌, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌ను ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాడు. అష్ట క‌ష్టాలు ప‌డి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా