hyderabadupdates.com Gallery వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం

వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం

వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం post thumbnail image

విజ‌య‌వాడ : దేశ వ్యాప్తంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రామ‌కృష్ణ మిష‌న్ ఎన‌లేని కృషి చేస్తూ వ‌స్తోంది. ఇందులో మ‌రో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని శైలజా థియేటర్ ఎదురుగా.. నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రామకృష్ణ మిషన్ బేలూర్ మఠం వారి అనుబంధ శాఖగా విజయవాడలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగ‌గా విజయవాడ రామకృష్ణ మిషన్ రజతోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ శుభ సందర్భంలో మాఘపౌర్ణమితో పాటు స్వామి అద్భుతానంద మహరాజ్ జయంతి కావడంతో ఆ పవిత్రమైన రోజున శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహరాజ్ చేతుల మీదుగా వివేకానంద హ్యుమన్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు విజయవాడ రామకృష్ణ మిషన్ వెల్ల‌డించింది. ఈ విశిష్ఠ కార్యక్రమానికి భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరవుతున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 9గం.లకు నూతన భవన ప్రారంభోత్సవం జరగనుందని విజయవాడ రామకృష్ణ మిషన్ సహాయ కార్యదర్శి శితికంఠ స్వామీజి వెల్లడించారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో మానసిక ఆరోగ్యం, ‘డిజిటల్’ వ్యసనాలపై సమాజం అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించుకున్న 2047 వికసిత భారత్ లక్ష్యాల సాకారంలో కీలకమైన ఉపాధి అవకాశాల పెంపులో రామకృష్ణమిషన్ సైతం తన వంతు భాగస్వామ్యం అవుతుంద‌ని శితికంఠ స్వామీజీ స్ప‌ష్టం చేశారు. దేశంలో ఎన్నో శిక్షణా కేంద్రాలున్నప్పటికీ సివిల్ సర్వీసులలో కీలకమైన విలువలు, నైతికత వంటి అంశాలలో ఈ ట్రైనింగ్ కేంద్రం ప్రత్యేక శిక్షణ ఇస్తుందన్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు ధ్యానం, యోగా, వ్యక్తిత్వ వికాసం, మనోనిగ్రహం, భావ ప్రకటన నైపుణ్యాల పైనా శిక్షణ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, అంతర్యోగం అలవరచు కోవచ్చన్నారు. బాల సంస్కార కేంద్రం ద్వారా ఆసక్తి కలిగిన వారికి గాత్రం, వాయిద్యాలు, యోగ, నృత్యం, విలువలు, నైతిక బోధ, భక్తిగీతాలను నేర్పనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన హ్యుమన్ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా 18 లక్షల మందికి పైగా శిక్షణ పొందినట్లు స్వామిజీ తెలిపారు.
The post వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నిర్ల‌క్ష్యం వ‌ద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ ప‌డొద్దు : ఏవీ రంగ‌నాథ్నిర్ల‌క్ష్యం వ‌ద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ ప‌డొద్దు : ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : అగ్ని ప్ర‌మాదాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డొద్ద‌ని హాస్ట‌ళ్ల నిర్వాహ‌కుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. వ‌స్తున్న‌ది వేస‌వి కాలం అని, ఎక్క‌డ ఏమాత్రం పొర‌పాటు జ‌రిగినా పెనుముప్పు సంభ‌విస్తుందని

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ పూర్తి కావాలిఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ పూర్తి కావాలి

హైద‌రాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్త‌య్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్ల‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం లోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్క‌టి చొప్పున వీటి నిర్మాణాలు

హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హైద‌రాబాద్ : ద‌ర్శ‌క‌, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌ను ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాడు. అష్ట క‌ష్టాలు ప‌డి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా