hyderabadupdates.com Gallery మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ post thumbnail image

హైద‌రాబాద్ : ప్రిన్స్ మ‌హేష్ బాబు, అందాల తార ప్రియాంక చోప్రా కీ రోల్స్ పోషించిన చిత్రం వార‌ణాసి. దీనికి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో దీనిని తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే వార‌ణాసి చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, గ్లింప్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. సినిమా ప్రారంభం నుంచి ఇప్ప‌టి దాకా ఉత్కంఠ పెంచుతూ పోతున్నాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌. ఇదిలా ఉండ‌గా వార‌ణాసి చిత్రంపై నెల‌కొన్న అనుమానాల‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు మూవీ మేక‌ర్స్. శుక్ర‌వారం మూవీ మేక‌ర్స్ అధికారికంగా సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు ప్ర‌తిష్టాత్మ‌కంగా వార‌ణాసి సినిమాను. రాజ‌మౌళి సోద‌రుడు ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. ఆయ‌న సినిమాల‌న్నింటికీ కీర‌వాణే మ్యూజిక్ ఇస్తూ వ‌చ్చాడు. మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించారు. కాగా వార‌ణాసి మూవీతో ల‌వ్లీ బ్యూటీ ప్రియాంక చోప్రా సుదీర్ఘ కాలం త‌ర్వాత భార‌తీయ సినిమాలో న‌టించింది. ఈ చిత్రంలో త‌ను మందాకిని పాత్ర‌లో న‌టిస్తోంది. ఇక వారణాసి మూవీ టైటిల్ ను గ‌త ఏడాది 2025 న‌వంబ‌ర్ 15న ఆవిష్క‌రించారు. చిత్ర నిర్మాతలు ఈ రోజు గ్లింప్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని పంచుకుంటూ, ఎస్ఎస్ రాజమౌళి పోస్ట్‌కు వారణాసి టు ది వరల్డ్ అని క్యాప్షన్ ఇచ్చారు.
The post మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదుస‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఒక ర‌కంగా ఆయ‌న చేసిన

Supreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలిSupreme Court: నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలి

        విచారణలో ఉన్న (అండర్‌ ట్రయల్‌) నిరుపేద ఖైదీల బెయిలు పూచీకత్తు సొమ్ము విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ

శ్రీ‌లంక‌తో భార‌త‌దేశం బంధం బ‌లోపేతంశ్రీ‌లంక‌తో భార‌త‌దేశం బంధం బ‌లోపేతం

ఢిల్లీ : శ్రీ‌లంక అధ్య‌క్షుడు అనుర కుమార దిస‌నాయ‌కేతో శుక్ర‌వారం భేటీ అయ్యారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఇండియా ఏఐ ఇంపాక్ట్ 2026 స‌ద‌స్సులో ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌లు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచాన్ని ఏఐ శాసిస్తోంద‌ని , ఈ