hyderabadupdates.com movies `సిట్` విచారణపై వ్యూహం రచిస్తున్న కేసీఆర్?

`సిట్` విచారణపై వ్యూహం రచిస్తున్న కేసీఆర్?

ఫోన్ ట్యాపింగ్ కేసులో  రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ ద‌ఫా కూడా.. సిట్ ముందుకు వెళ్లేందుకు స‌సేమిరా అంటున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇదే స‌మ‌యంలో సిట్ నోటీసుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ఆయ‌న ప్ర‌య‌త్నా లు చేస్తున్న‌ట్టు బీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

1)  త‌న‌పై క‌క్ష క‌ట్టి.. ప్ర‌భుత్వం వేధిస్తోంద‌న్న కోణంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లడం: ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల ఎన్నికలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో సిట్ రూపంలో త‌న‌ను వేధిస్తున్నార‌ని.. తెలంగాణ తీసుకురాబ‌ట్టే ప్ర‌స్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌న్న సెంటిమెంటును కేసీఆర్ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల నున్న‌ట్టు బీఆర్ ఎస్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

2)  ఫోన్ ట్యాపింగ్ అనేది లేద‌నే వాద‌న: అస‌లు ఫోన్ ట్యాపింగ్ అనేది లేనేలేద‌ని.. గ‌తంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వాద‌న‌ను కేసీఆర్ కూడా ప్ర‌జ‌ల‌కు వినిపించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. ఇది తూతూ మంత్రం విచార‌ణ అని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌ను అష్ట‌దిగ్భంధం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. ఇది పూర్తిగా రాజ‌కీయ కుట్రేన‌న్న‌ది కేసీఆర్ వాద‌న‌. ఈ క్ర‌మంలో దీనినే ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.

స‌క్సెస్ ఎంత‌?

వాద‌న ఎలా ఉన్నా.. ప్ర‌జ‌లు ఏమేర‌కు విశ్వసిస్తారు? అనేది ప్ర‌ధానం. గ‌తంలో జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల స‌మయంలో కాళేశ్వ‌రం క‌మిష‌న్‌పై బీఆర్ఎస్ నిప్పులు చెరిగింది. ఉద్దేశ పూర్వ‌కంగా త‌మ‌ను వెంటాడుతున్నార‌ని.. కాళేశ్వ‌రం బ‌హుళార్ధ సాధ‌క ప్రాజెక్టు అని కూడా చెప్పారు. కానీ, ప్ర‌జ‌లు ఏమ‌నుకున్నారో.. ఏమో.. జూబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ప్ర‌ణాళిక‌లు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో సిట్‌ను వినియోగించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్న ఆ పార్టీకి ప్ర‌జ‌లు ఏమేర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది చూడాలి.

Related Post

‘కొదమసింహం’ సీక్రెట్ చెప్పిన చిరు‘కొదమసింహం’ సీక్రెట్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి ఫిల్మోగ్రఫీలో ‘కొదమ సింహం’ చాలా ప్రత్యేకం. తెలుగులో అరుదు అనదగ్గ కౌబాయ్ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. అంతకుముందు కృష్ణ మాత్రమే ఆ పాత్రలో అలరించారు. చిరు అంతకుమించిన స్వాగ్, స్టైల్‌తో కౌబాయ్ పాత్రను అద్భుతంగా పోషించాడు. కమర్షియల్‌గా

‘జోగి రమేశే నకిలీ లిక్కర్ తయారు చేయమన్నారు’‘జోగి రమేశే నకిలీ లిక్కర్ తయారు చేయమన్నారు’

గత వారం పది రోజులుగా ఏపీని కుదిపేస్తున్న నకిలీ లిక్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మద్యం తయారు చేస్తున్న కీలక నిందితుడు కేసులో ఏ-1గా ఉన్న జనార్దన్‌రావు తాజాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు.

Worldwide Theatrical Release on Nov14th for Santhana PrapthirasthuWorldwide Theatrical Release on Nov14th for Santhana Prapthirasthu

Santhana Prapthirasthu hitting the big screens on November 14th, as the makers officially announce its grand theatrical release. The film, a youthful family entertainer, has been creating waves with its