hyderabadupdates.com movies బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయం నుంచి గుంటూరులో హైడ్రామా నడిచింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి, ఆ తర్వాత తాను తిట్టింది చంద్రబాబును కాదని.. దాడికి పాల్పడిన వాడినని చెబుతూ.. రెడ్ బుక్కుకి తన ఇంట్లో కుక్క కూడా భయపడదు, అరెస్టు చేస్తే చేసుకోండి అంటూ.. రెచ్చగొట్టేలా మాట్లాడారు.

ఆ తర్వాత గుంటూరులో తన నివాసానికి ఆయన చేరుకున్నారు. అంబటి వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. ఇంటికి వెళ్లి ఫర్నిచర్, కారును ధ్వంసం చేశారని వైసిపి ఆరోపిస్తోంది. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం అంబటి రాంబాబు ఫోన్ చేసి పరామర్శించారు. 

రాత్రి పది గంటల తర్వాత మరోసారి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో పోలీసులు ఆయనను భారీ బందోబస్తు మధ్య అరెస్టు చేసి వజ్రా వాహనాన్ని ఎక్కించారు. అక్కడ నుంచి రాంబాబును నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారని సమాచారం ఉంది.

Related Post

Manchu Manoj Unleashes David Reddy Madness with Powerful first lookManchu Manoj Unleashes David Reddy Madness with Powerful first look

The makers of David Reddy, starring Rocking Star Manchu Manoj, have officially released the film’s first look poster, igniting excitement among fans. Set between 1897 and 1920, the film tells