hyderabadupdates.com Gallery ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ

ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ

ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీలో త‌మ ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంద‌న్నారు. శ‌నివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందే అందించడం జ‌రిగింద‌న్నారు. ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం కనిపిస్తోందని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్. రాయవరం మండలం సోముదేవుపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. సోముదేవుపల్లి వద్ద వరాహ నదికి రక్షణ గోడ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు కావడంపై గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపల్లెలోని తన నివాసం వద్ద 5555 ఇ-సైకిళ్లను పంపిణీ చేశారు. ఇ-సైకిళ్ల పంపిణీ అనంతరం ప్రజావేదిక వద్దకు ఇ-సైకిల్ ర్యాలీ చేపట్టారు. కుప్పం స్థానికులతో కలిసి ఇ-సైకిల్ ర్యాలీలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు సీఎం. 5555 ఇ-సైకిళ్లతో గిన్నిస్ బుక్ రికార్డు సాధించేలా ర్యాలీ నిర్వ‌హించారు. తూంసీలోని ప్రజావేదిక వద్దకు ఇ-సైకిల్ తొక్కుకుంటూ ర్యాలీగా చేరుకున్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రజా వేదిక డయాస్ వరకు ఇ-సైకిల్ తొక్కుకుంటూ రావ‌డం విశేషం. పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌సంగం చేశారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీని దేశంలోనే నెంబ‌ర్ 1గా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.
The post ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలుVijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలు

Vijay Mallya : బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్‌ మాల్యా (Vijay Mallya)… దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీల

India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?

      బిహార్‌ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి

ఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీ

దావోస్ : దావోస్ లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు 2026లో పాల్గొన్నారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు, తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి