hyderabadupdates.com movies త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడేలా టైటిళ్లు పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు త్రివిక్రమ్. అతడు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అరవింద సమేత.. లాంటి టైటిళ్లు ఈ కోవకే చెందుతాయి.

ఇప్పుడు యువ దర్శకుడు వెంకీ అట్లూరి త్రివిక్రమ్ స్టయిల్లో తన కొత్త చిత్రానికి టైటిల్ పెటినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా పేరు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ని గుర్తు చేసేలా.. తన సినిమాకు ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారు చేశాడట వెంకీ. 

చివరగా తీసిన ‘లక్కీ భాస్కర్’తో గొప్ప పేరు సంపాదించిన వెంకీ.. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్యతో ఒక ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథకు ‘విశ్వనాథం అండ్ సన్స్’ అన్నది యాప్ట్ టైటిల్‌గా ఫీలయ్యారట. ఈ పేరును ఖరారు చేశారని.. త్వరలోనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం.

ఈ సినిమాను నిర్మిస్తున్నది సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ. ఈ బేనర్‌లో తీసే ప్రతి చిత్రంలో తివిక్రమ్ ప్రొడక్షన్ హౌస్ ‘ఫార్చ్యూన్ ఫోర్’ భాగస్వామిగా ఉంటుంది. కాబట్టి ‘విశ్వనాథం అండ్ సన్స్’ సినిమాలో త్రివిక్రమ్ చేయి కూడా ఉన్నట్లే.

ఓ మంచి విజయం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న సూర్యకు ‘విశ్వనాథం అండ్ సన్స్’తోనే ఆ లోటు తీరుతుందేమో చూడాలి. దీని కంటే ముందు ‘కరుప్పు’ అనే మరో సినిమా రావాల్సి ఉన్నప్పటికంటే.. దాని కంటే వెంకీ సినిమానే ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది.

ఇందులో సూర్య నడి వయస్కుడిగా కనిపిస్తుంటే.. తన వయసులో సగం ఉండే మామిత బైజుతో ప్రేమలో పడేలా ఈ పాత్రను తీర్చిదిద్దారట. ఈ లైనే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related Post

మందుబాబులూ…సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!మందుబాబులూ…సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!

మందుబాబులం మేము మందుబాబులం…మందుకొడితె మాకు మేమె మహారాజులం…నిజంగానే చాలామంది మందుబాబులు మందేయగా ఇలాగే ఫీలవుతుంటారు. అందుకే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగానే…మా నాన్నఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా? ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి

లిటిల్ హార్ట్ మౌళి కోసం ‘కోటి’ ఆఫర్లా?లిటిల్ హార్ట్ మౌళి కోసం ‘కోటి’ ఆఫర్లా?

చిన్న సినిమాగా వచ్చి పెద్ద సెన్సేషన్ గా నిలిచిన లిటిల్ హార్ట్స్ హీరో మౌళి డిమాండ్ మాములుగా లేదు. ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఏకంగా కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిందనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

‘నేను తెలంగాణ ప్రజల బాణాన్ని..’‘నేను తెలంగాణ ప్రజల బాణాన్ని..’

తెలంగాణలో రాజకీయ శపథకాలు పెరుగుతున్నాయి. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను మరోసారి అధికారంలోకి రానివ్వబోనంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొడతామంటూ కేసీఆర్ శపథం చేశారు. తాజాగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత